హవాయి : వందేళ్ల వయసు ఉన్న వాళ్లే సిగరెట్ తాగాలి

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 09:08 AM IST
హవాయి : వందేళ్ల వయసు ఉన్న వాళ్లే సిగరెట్ తాగాలి

మానవ చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైనది సిగరెట్‌. సాధారణంగా మన దేశంలో పొగ తాగడానికి కనీస వయసు 18 ఏళ్లు. దాదాపు అన్ని రాష్ర్టాల్లో ఈ వయసు దాటిన వాళ్లకే పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. కానీ ఒక్క హవాయి రాష్ట్రంలో మాత్రం ఈ పరిమితి 21 ఏళ్లుగా ఉంది. అయితే ఇప్పుడదే రాష్ట్రంలో ఆ పరిమితిని 100 ఏళ్లకు పెంచాలన్న కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అక్కడి చట్ట ప్రతినిధి రిచర్డ్ క్రీగన్. 2024లోపు మొత్తంగా సిగరెట్‌పై నిషేధం విధించాలన్నది ఆయన లక్ష్యం. ఇప్పటికే హవాయిలో సిగరెట్ అమ్మకాలకు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. 

రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం పై ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. చట్టరీత్యా వచ్చే ఏడాదికి  పొగతాగే వయసును 30 ఏళ్లకు, 2021లో 40 ఏళ్లకు, 2022లో 50 ఏళ్లకు, 2023లో 60 ఏళ్లకు, ఇలా 2024 నాటికి వందేళ్లకు పెంచాలని ఆయన ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు కలగకుండా రూపొందించినట్లు క్రీగన్ స్పష్టం చేశారు.