షాకింగ్ వీడియో : చూస్తుండగానే సముద్రంలోకి జారిపోయిన ఇళ్లు

10TV Telugu News

ప్రశాంతంగా ఉండే ప్రకృతి మనిషిపై పగబడితే ఆకాశంలోని గ్రహాలను చుట్టి వచ్చే మనిషి కళ్లప్పగించి చూస్తుండాల్సిందే తప్ప  ఏమీ చేయలేడు. మహా అయితే ముందు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోగలడు అంతే. కానీ ప్రకృతి ప్రకోపాన్ని మాత్రం అడ్డుకోలేడు. ఆ ప్రకృతి ప్రకోపాలను ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. అటువంటిదే జరిగింది నార్వేలో. 

కళ్లతో చూస్తుండగానే ఇళ్లన్నీ సముద్రంలోకి జారి వెళ్లిపోయిన విధానం చూస్తే నిజమేనేమో..ప్రకృతి పగబట్టిందేమోననిపిస్తుంది. అక్కడ అకస్మాత్తుగా కాళ్ల కింద భూమి కదిలింది.  నార్వేలోని అల్టా ప్రాంతంలో చూస్తుండగానే..ఇళ్లన్నీ సముద్రంలోకి జారిపోయాయి. క్షణాల వ్యవధిలో ఆ ఇళ్లు.. వాహనాలు ఆట బొమ్మల్లా జారుకుంటూ..నీటిలో మునిగిపోయాయి. 

సముద్ర తీరంలో ఉన్న పర్వతం కింద మట్టి కొట్టుకుపోవడంతో ఈ విపత్తు చోటుచేసుకుంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో ప్రజలకు పెద్ద ప్రమాదం తప్పింది. ఇళ్లు సముద్రంలో మునిగిపోతున్న వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read: వీళ్లు చాలా రిచ్ : ఐఫోన్లతో ఇంటి ప్రహరీగోడ కట్టేశారు!!