మకర సంక్రాంతిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే?

  • Published By: sreehari ,Published On : January 14, 2020 / 06:42 AM IST
మకర సంక్రాంతిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే?

సంక్రాంతి పండగ.. మన తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన పండగ కాదండీ.. భారతేదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దక్షిణ భారత్‌లోని తమిళనాడులో పొంగల్ అని, అసోంలో భొగాలి బిహు అని, పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘీ అని, యూపీలో కిచెరి, మధ్యప్రదేశ్ లో సంక్రాంతిని సుకరాత్ అని, కేరళలో మకర విళక్కు అంటూ ఇలా ఎన్నో పేర్లతో కన్నుల పండుగగా జరుపుకుంటారు.

ఒక్క భారతదేశంలోనే కాదండోయ్.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వారు (తెలుగువారు, భారతీయులు కాకుండా) తమ సంస్కృతి సాంప్రదాయలకు తగినట్టుగా మకర సంక్రాంతిని జరుపుకోవడం ఎన్నోయేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా  ఏయే దేశాల్లో మకర సంక్రాంతిని (భారత్ తో పాటు 7 దేశాల్లో) ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకుందాం.. 

1. భారత్  (మకర సంక్రాంతి) :
మకర సంక్రాంతి.. ప్రతి ఏడాదిలో జనవరి 15న వస్తుంది. దీన్ని వార్షిక హార్వెస్ట్ ఫెస్టివల్ గా పిలుస్తారు. అంటే.. పండిన పంట కోతకు వచ్చే సమయమని అర్థం. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు, అందుకే ఈ రోజును మకర సంక్రాంతి అంటారు. రైతులతో పాటు అందరూ ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు.
As India Celebrates Makar Sankranti, Here Are How 7 Countries Across The World Celebrate Harvest Festivals

యావత్ భారత్ లో అన్ని రాష్ట్రాల్లోనూ మకర సంక్రాంతిని తమ సంప్రదాయలకు తగినట్టుగా జరుపుకుంటుంటారు. పక్క దేశమైన నేపాల్ లో కూడా అన్ని ప్రాంతాలలో వివిధ సాంస్కృతిక రూపాల్లో సంక్రాంతిని జరుపుకుంటారు. గుజరాత్ ఎగిరే గాలిపటాల ద్వారా ఈ పండుగను జరుపుకుంటారు. అదే పంజాబ్‌లో మాఘీ పేరుతో ఓల్ భాంగ్రా వేడుకలు జరుపుకుంటారు. 

2. ThanksGiving (USA) :
అమెరికాలో మకర సంక్రాంతిని ThanksGiving అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. అమెరికన్ టీవ షోలతో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. మనకు తెలిసిన హార్వెస్ట్ ఫెస్టివల్ వంటి పర్వదినాల్లో థ్యాంక్స్ గివింగ్ అనేది ఒకటి. దీన్ని US హాలీడేగా పిలుస్తారు. నవంబర్ నెలలో 4వ మంగళవారం రోజున ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఆ రోజున ఒక్కొక్కరుగా తమ ఫ్యామిలీ, ఇష్టమైనవారితో కలిసి నచ్చిన వంటకాలను తింటూ కబర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారు.
Thanksgiving fest

ఈ సందర్భంగా తినే పదార్థాల్లో ఇతర ఐటమ్స్ తో పాటు టర్కీ మీల్ ఉండాల్సిందే. ఇది 1621 లో పుట్టింది. యాత్రికులు చేతికొచ్చిన తమ గోధుమ పంటను మూడు రోజుల విందుతో సెలబ్రేట్ చేసుకుంటారు. వారు తమ పేట్రిడ్జ్ విందును, వైల్డ్ టర్కీ, చేపల భోజనాన్ని స్థానిక అమెరికన్ తెగలతో పంచుకుంటారు. 

3. బాలి రైస్ హార్వెస్ట్ (ఇండోనేషియా) :
ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ధాన్యం పంట కోతకు రాగానే సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. బాలిలో వరిని ధాన్యలక్ష్మిగా పూజిస్తారు. ఈ పండగ సమయంలో గ్రామస్థులంతా కలిసి జెండాలతో తమ ఇళ్లను అలకరిస్తారు.
Bali festivals

సాధారణ వెదురుకర్రలతో దేవతకు గౌరవార్థంగా దేవాలయాలను నిర్మించి అందంగా అలంకరిస్తారు. వరి పొలాల్లోని అత్యంత పవిత్రమైన మూలల్లో ఈ వెదరుతో కూడిన దేవాలయాలను నిర్మించి వేడకులు జరుపుకుంటారు. 

4. మూన్ ఫెస్టివల్ (చైనా) :
చైనాలో హార్వెస్ట్ సీజన్ సమయంలో మూన్ ఫెస్టివల్ జరుపుకుంటారు. చైనీస్ చంద్రుని క్యాలెండర్ ప్రకారం.. 8వ నెలలో 15 రోజును చైనీస్ హార్వెస్ట్ మూన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వరిధాన్యం, గోధుమ పంటలు కోతకు వచ్చిన సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు.

moon festival

ఈ సందర్భంగా కుటుంబాలంతా ఒకే చోట చేరి పౌర్ణమిని వీక్షిస్తారు. ఇది సామరస్యం, అదృష్టం, సమృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు. వేడిగా ఉన్న చైనీస్ టీని కప్పులో ఆస్వాధిస్తూ వివిధ రకాల మూన్ కేక్‌లను ఆరగిస్తారు. ఆకాశంలోకి ఎగిరే లాంతర్లను వదిలి వీక్షిస్తుంటారు. 

5. Sukkot ( ఇజ్రాయెల్) :
ఇజ్రాయెల్ దేశంలోని జెరూసెలంలో సుక్కోట్ పేరుతో మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఇజ్రాయెల్ ప్రజలు తాత్కాలిక గృహాలను ఏర్పాటు చేసుకుని అందులో నివసిస్తారు.

sukkot

కుటుంబాలన్ని కలిసి పూరిగుడిసెలను నిర్మించడం లేదా ఆకాశం కనిపించేలా సుక్కోట్ పైకప్పులను ఏర్పాటు చేస్తారు. అదే గుడిసెల్లో విందు ఆరగిస్తారు. కొన్నిసార్లు ఏడు రోజులు పాటు అందులోనే నిద్రిస్తుంటారు.

6. ఫ్లవర్ ఫెస్టివల్ (పోర్చుగల్) :
పోర్చుగల్ దేశంలో మదీరా ఫ్లవర్ ఫెస్టివల్ జరుపుకుంటారు. ఏప్రిల్ నెలలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వసంత మాసానికి స్వాగతం పలుకుతూ పూలతో సువాసనలను వెదజల్లేలా అలంకరిస్తారు.

flower festival

ఈ ద్వీపంలో పిల్లలతో సహా ప్రతిఒక్కరూ రంగురంగుల గోడను నిర్మిస్తారు. ఎక్కడ చూసిన పూలతోనే కలర్ ఫుల్ వాతావరణం కనిపిస్తుంది. అంతేకాదు.. వీధుల్లో భారీ పూల తివాచీలను ఏర్పాటు చేస్తారు. 

7. లామాస్ ఫెస్టివల్ (UK) : 
యూకేలో పంట కోత ప్రారంభంలో ఈ పండుగ వస్తుంది. కొత్త పంట చేతికొచ్చి ఆహారం సమృద్ధిగా దొరికే సమయం అది. ఈ సందర్భంగా లామాస్ పండుగను వైభవంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు. 

lammas festival

బ్రిటన్స్ కొత్త పంట గోధుమల నుంచి తీసిన పదార్థాలతో రొట్టెలు కాలుస్తారు. ఆ రొట్టెలను క్రైస్తవ ప్రార్థన మందిరాలలో పూజా పీఠంపై వదిలేయడం అక్కడి సంప్రదాయంగా నడుస్తోంది.