India-China: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే, గత ఏడాది డిసెంబరులో భారత్-చైనా ఉద్రిక్తతలు తగ్గడానికి చేసిన ప్రయత్నాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్-చైనా అంశంపై స్పందించారు.

India-China: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే, గత ఏడాది డిసెంబరులో భారత్-చైనా ఉద్రిక్తతలు తగ్గడానికి చేసిన ప్రయత్నాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్-చైనా అంశంపై స్పందించారు.
ప్రస్తుతం భారత్-చైనా మధ్య పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని తమకు తెలిసిందని చెప్పారు. కాగా, అనేక విషయాల్లో అమెరికాకు భారత్ ముఖ్యమైన మిత్రదేశం అని చెప్పారు. వాణిజ్య, భద్రత, సాంకేతిక సహకారం విషయంలో తమకు భాగస్వామి అని చెప్పారు. 2020లో లద్ధాక్ లో చోటుచేసుకున్న ఘర్షణల అనంతరం కూడా పలు సార్లు చైనా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
సరిహద్దు ప్రాంతాల వద్ద దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలను భారత్-చైనా నిర్వహించాయి. సరిహద్దుల వద్ద చైనా మౌలిక సదుపాయాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు నిలకడగానే ఉన్నాయని ఇటీవల చైనా మంత్రి వియోడాంగ్ కూడా చెప్పారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని అన్నారు. అయితే, సరిహద్దుల వద్ద శాంతికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే దాని ప్రభావం ఇరు దేశాల బంధంపై పడుతుందని భారత్ స్పష్టం చేసింది.
India 74th Republic celebrations : 74వ గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మేడిన్ ఇండియా ఆయుధాలు