చైనాతో యుద్ధం వస్తే గెలిచేదెవరు.. వారి బలాలేంటి?

  • Published By: Subhan ,Published On : June 19, 2020 / 09:53 AM IST
చైనాతో యుద్ధం వస్తే గెలిచేదెవరు.. వారి బలాలేంటి?

ఇండియా-చైనాల మధ్య లడఖ్‌లో జరిగిన కాల్పుల్లో 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి యుద్ధ యంత్రాలపై మన వాళ్ల ఫోకస్ పడింది. చరిత్రలో చైనా యుద్ధంలో గొప్ప విజయాలే సాధించి ఉండొచ్చు కానీ, యుద్ధ అనుభవాల్లో ఇండియా తక్కువేం కాదు. 

చరిత్రలో ఇండియా-చైనా వాదనలు ఎక్కడ మొదలైయ్యాయి:
ఇండియా-చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) గుర్తులు.. సరిహద్దు వెంబడి 3వేల 488కిలోమీటర్లు ఉన్నాయి. 1914లో చైనా ప్రతినిధులు టిబెట్ లో కలుసుకున్నారు. ముందు అగ్రిమెంట్ ఒప్పుకున్న చైనా.. తర్వాత మాట వెనక్కు తీసుకుంది. అది 1962లో ఇండియాపై దాడి చేసి భారత భూభాగంలో ఉన్న అక్సయ్ చిన్ ను ఆక్రమించుకున్న తర్వాతే స్పష్టమైంది. 

లడఖ్ లోని కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించుకోవడానికే ప్రయత్నిస్తుంది. దాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తమ భూభాగానికి సంబంధించినదిగానే చెప్పుకుంటున్నాయి. 

ఆర్మీల్లో ఎవరి బలమెంత?
2019లెక్కల ప్రకారం.. డిఫెన్స్ బలగాల కోసం చైనా 261బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంటే.. ఇండియా 71.1బిలియన్ డాలర్లు వెచ్చిస్తుంది. ఇద్దరిలో మాత్రం ఒకటే సారూప్యత కనిపిస్తుంది. చైనా సైనికులు 2లక్షల నుంచి 2.3లక్షల మంది ఉంటే ఇండియా సైనికులు 2లక్షల 25వేల మంది. 

హార్వార్డ్ కెనడీ స్కూల్ బెల్ఫెర్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ కథనం ప్రకారం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ 2000, సుఖోయ్ సు 30 జెట్స్ బలవంతమైన ఆయుధాలను తయారుచేశారు. అదే సమయంలో చైనాకు జే-10, జే-11లతో పాటు సు-27ఎయిర్ క్రాఫ్ట్. అన్ని వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా గాలిలో ప్రయాణించే ఎయిర్ క్రాఫ్ట్ మన దగ్గర లేకపోయినా.. చైనాలో జే-10ఎయిర్ క్రాఫ్ట్ మల్టీ రోల్ లా వాడుకోవచ్చు. 

అన్నింటిలోనూ చైనానే గొప్పా:
యుద్ధ అనుభవంలో ఇండియాకు ఎక్కువ అనుభవం ఉంది. దశాబ్దాల తరబడి పోరాడుతూ అనుభవం గడించింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి వియత్నాంతో 1979 జరిగిన యుద్ధం తర్వాత మళ్లీ ఎప్పుడూ వివాదాలు లేవు. చైనా సరిహద్దుల్లోని ఎయిర్ బేసెస్ లో ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ చేయడానికి వీలుంది. 

మిలటరీల బలాలు:
చైనా బలగాలు టిబెట్, గ్సిన్‌జియాంగ్ వంటి ఎత్తైన ప్రదేశఆల్లో విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య మొహరించి ఉంటాయి. చైనీస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేట్ చేయడానికి హాఫ్ పే లోడ్, ఫ్యూయెల్ ఉంటే సరిపోతుంది. ఇండియా బలగాలు బోర్డర్ వద్దనే ఉంటాయి. కమాండింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్ కు, ఎయిర్ డిఫెన్స్ కు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. చైనా ఎయిర్ ఫోర్స్ ఎనిమిది బేస్ లను వాడుకుంటుంటే.. అందులో చాలా ఎయిర్ ఫీల్డ్స్ సమస్యాత్మకమైన ఎలివేషన్స్ తో కూడినవే. చైనీస్ విమానాలకు ఇంకా ఎక్కువ పే లోడ్ వేయడానికి ఆయిల్ రీపిల్ చేయాల్సి ఉంటుంది. కానీ, వాళ్ల దగ్గర సరిపడ ట్యాంకర్లు లేవు. 

సమస్య ఎవరికి:
టెక్నాలజీపరంగా, కొత్త ఆయుధాల విషయానికొస్తే చైనా చాలా స్ట్రాంగ్. ఇరు దేశాల్లో న్యూ క్లియర్ ఆయుధాలు ఉన్నప్పటికీ చైనానే అడ్వాన్స్‌డ్ గా ఉంది. ఇండియా జాయింట్ మిలటరీ విభాగాలైన యూఎస్, ఆస్ట్రేలియా,  జపాన్, ఫ్రాన్స్ లతో కలిపి పోరాడితే చైనాకు చుక్కలే. యూఎస్ ఇంటిలిజెన్స్ యుద్ధం చేసే స్పాట్లన్నింటినీ ఇండియాకు క్లియర్ పిక్చర్ ఇస్తుంది. చైనాపై ప్రస్తుతం covid-19వ్యాప్తికి కారణమైందంటూ యూఎస్, ఆస్ట్రేలియా, వియత్నాంలు వ్యతిరేకంగా ఉన్నాయి. 

Read: విమానం టిక్కెట్లు బుక్ చేస్తూ.. రూ.3కోట్లు నొక్కేసిన మహిళ