India-China గొడవల్లో చనిపోయింది 35మంది చైనా సైనికులు

  • Published By: Subhan ,Published On : June 17, 2020 / 01:08 PM IST
India-China గొడవల్లో చనిపోయింది 35మంది చైనా సైనికులు

చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA)కు చెందిన 35మంది సైనికులు గాయాలకు గురైయ్యారని పీటీఐ తెలిపింది. వీటిపై చైనా విదేశాంగ శాఖ, పీఎల్ఏ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. గాల్వాన్ లోయలో జరిగిన వాదనపై క్లారిటీగా చైనా ఆర్మీ ఏం చెప్పలేదు. జూన్ 16న ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. చైనీయుల్లో కూడా ఇండియాకు మించి ప్రాణ నష్టం జరిగింది. 

అయితే ఏఎన్ఐ మీడియా కథనం ప్రకారం.. ఓ 40మంది వరకూ నష్టపోయినట్లు తెలుస్తోంది. చైనా తరపు నుంచి అంబులెన్స్‌లు, స్ట్రెచర్స్, హెలికాఫ్టర్ సర్వీసులు పెంచేశారు. ఇండియా డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు ముగ్గురు సర్వీస్ చీఫ్ లతో చర్చలు నిర్ణయించారు. 

ప్రధాని నరేంద్ర మోడీతో డిఫెన్స్ మినిస్టర్, అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన, ఆర్మీ చీఫ్ ఎమ్ఎమ్ నరవనె ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు. జూన్ 17న ఇరు వర్గాలపై ఎంత మంది చనిపోయారోనని బీజింగ్ లెక్కపెట్టడం లేదు. పబ్లిక్ మూడ్ ను కూడా విస్మరించాలని అనుకుంటుంది. 

సోమవారం రాత్రి చనిపోయిన 20మంది ఆర్మీ వ్యక్తుల్లో ఓ కల్నల్ కూడా ఉన్నారు. ఇరు మిలటరీ వర్గాల మధ్య 1967నుంచి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. 1967లో నాథు లా ప్రాంతంలో జరిగిన వివాదంలో భారత్ సైనికులు 80మంది చనిపోగా చైనీస్ ఆర్మీ పర్సనల్ లు 300మంది ప్రాణాలు కోల్పోయారు.