భారత్ VS చైనా : అణ్వాయుధ రెండు దేశాల బలాబలాలు ఎంతంటే?

  • Published By: srihari ,Published On : June 18, 2020 / 08:51 AM IST
భారత్ VS చైనా : అణ్వాయుధ రెండు దేశాల బలాబలాలు ఎంతంటే?

లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా దళాలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ సహా కనీసం 20 భారతీయ సైనికులు అమరలయ్యారు. ఐదు దశాబ్దాల కాలంలో ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ‘దేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం గట్టిగా కట్టుబడి ఉందని’ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. 

ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన భారత్-చైనా రెండు దేశాల్లో అణ్వాయుధాలు సుదీర్ఘ సరిహద్దులో సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. పొరుగు దేశాలైన భారత్-చైనా మధ్య ప్రతిష్టంబన నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల్లో అణ్వాయుధపరంగా మాత్రమే కాకుండా అంగబలం వంటి విషయాల్లో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయో ఓసారి చూద్దాం. 

అంగబలం :
globalfirepower.com డేటా ప్రకారం.. భారతదేశంలో 3,544,000 (అంచనా) మిలటరీ సిబ్బందితో మరింత అంగబలం ఉంది. చైనాలో సైనిక సిబ్బంది 2,693,000 (అంచనా) ఉన్నారు. 

ఎయిర్ పవర్ :
ఇటీవలి గణాంకాల ప్రకారం.. భారతదేశంలోని 2,123 ఎయిర్ పవర్ కంటే.. చైనాలోనే 3,210తో ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.

ల్యాండ్ ఫోర్సెస్ : 
ఇటీవలి డేటా ప్రకారం.. చైనాలో ల్యాండ్ ఫోర్సెస్ 3,500 కంటే.. భారతదేశంలో 4,292 ఎక్కువ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి.

నావికా దళాలు : 
భారతదేశంలో నావిక దళాలు 285 కంటే చైనాలోనే నావికాదళ ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి.

సహజ వనరులు :
చైనా 3,838,000 BBL చమురును ఉత్పత్తి చేస్తుండగా.. భారతదేశం 733,900 BBL ఉత్పత్తి చేస్తుంది.

లాజిస్టిక్స్ : 
భారతదేశ శ్రామిక శక్తి (521,900,000), వ్యాపారి సముద్ర బలం (1,719) కంటే చైనాకు ఎక్కువ శ్రమశక్తి ( 806,700,000) వ్యాపారి సముద్ర బలం (4,610  ) ఉన్నాయి.

ఆర్ధిక సంబంధమైనవి :
globalfirepower.com ప్రకారం..  2020-21 సంవత్సరానికి భారత రక్షణ బడ్జెట్  61,000,000,000 అమెరికా డాలర్లు కాగా, చైనా రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు అధికంగా 237,000,000,000 డాలర్లు ఉంటుంది.

భౌగోళిక :
చైనా 9,596,961 కిలోమీటర్ల భూభాగాన్ని కలిగి ఉంది. భారతదేశం 3,287,263 కిలోమీటర్ల కంటే దాదాపు మూడు రెట్లు పెద్దది.