Sikh flag: సిక్కుల జెండా తొలగించిన తాలిబాన్లు.. గురుద్వారాలో ఉద్రిక్తత.. ఖండించిన భారత్

Sikh flag: సిక్కుల జెండా తొలగించిన తాలిబాన్లు.. గురుద్వారాలో ఉద్రిక్తత.. ఖండించిన భారత్

Sikh

Sikh flag: ఆఫ్ఘనిస్తాన్‌లో విస్తరిస్తున్న తాలిబాన్ గ్రూప్‌లు తమ వాదాన్ని వినిపించే క్రమంలో తీవ్ర కార్యకలాపాలు చేస్తున్నాయి. ఈక్రమంలోనే రాడికల్ విధానాల్లో భాగంగా.. తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టియా ప్రావిన్స్‌లోని పవిత్ర గురుద్వారా తాల్ సాహిబ్ పైకప్పుపై ఉన్న సిక్కుల జెండా అయిన నిషన్ సాహిబ్‌ని తాలిబాన్లు తొలగించారు. ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టించడం ద్వారా తాలిబాన్లు ముందుకు సాగుతున్నారు. కానీ నిషన్ సాహిబ్‌ను తొలగించిన విధానాన్ని భారత్ ఖండిస్తోంది.

అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత సరిహద్దు జిల్లాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న తాలీబన్లు.. ఆయా ప్రాంతాల్లో ప్రజలపై ఆంక్షలు, కఠిన నిబంధనలు విధించడంతోపాటు అరాచకాలకు పాల్పడుతున్నారు. పాక్టియాలోని చాంక్నీలో ఉన్న గురుద్వారా సిక్కు సమాజంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. శ్రీ గురునానక్ దేవ్ కూడా ఈ చారిత్రక గురుద్వారాను సందర్శించారు. దాని పైకప్పుపై ఉన్న నిషాన్ సాహిబ్‌ను తాలిబాన్లు తొలగించడంతో ఇప్పుడు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ఆఫ్ఘన్‌లో మైనారిటీలైన సిక్కులపై, మరియు హిందువులపై దౌర్జన్యాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి, పక్టియా ప్రాంతం 1980ల నుండి ముజాహిదీన్ మరియు తాలిబాన్/హక్కానీ సమూహాలకు బలమైన కోటగా ఉండేది. తాలిబాన్ భీభత్సం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇక్కడ జోక్యం చేసుకోకూడదు అనేది వారి వాదన.

గత సంవత్సరం కూడా నిదాన్ సింగ్ సచ్‌దేవ్ కిడ్నాప్ చేయబడ్డారు. సవన్ నెల ముందు సేవ కోసం గురుద్వారా చేరుకోగా.. అతనిని కిడ్నాప్ చేశారు. తర్వాత అతడిని విడుదల చేయడం జరిగింది.