కేసులు పెరుగుతున్నా, ఇండియాలో తగ్గుతున్న కరోనా మరణాల రేటు

10TV Telugu News

ఇండియాలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొద్ది వారాల క్రితం వరకూ కేసులు పెరుగుతుంటే దాంతో పాటు చావు రేటు పెరుగుతూ వస్తుంది. జూన్ నెల మధ్య నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇన్ఫెక్టెడ్ కేసులు కంటే ఎక్కువగా నమోదవుతున్న చావులు తగ్గిపోతున్నాయి. ఒక్క సోమవారం నమోదైన కేసులను బట్టి చూస్తే ఇది స్పష్టమవుతోంది.

ఇండియాలో 22.68లక్షల మంది కొవిడ్ పాజిటివ్ గా తేలితే.. అందులో దాదాపు 45వేల మంది చనిపోయారు. అంటే ప్రపంచంలోనే అత్యధిక ఐదో చావు రేటు. యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, మెక్సికో, యూకేల తర్వాత ఇండియా నిలిచింది. చావు రేటును బట్టి చూస్తే వరల్డ్ యావరేజ్ 3.7శాతంగా ఉంది.

ఈ నిష్పత్తిని బట్టే తెలుస్తోంది మహమ్మారి ప్రభావం ఎంత ఉందో. పాజిటివ్ కేసులు పెరుగుతుండటాన్ని బట్టి వైరస్ వాహకాలుగా ఎక్కువమంది ప్రభావం చూపిస్తున్నట్లుగా క్లియర్ అయింది. కొందరిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించకపోవడంతో వారి నుంచి వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. టెస్టులు చేయకుండా ఫలితాలు తెలియవు కాబట్టి వారికి తెలియకుండానే వ్యాప్తి చేస్తున్నారు.

ఇలా చూస్తే కేసులు పెరుగుతున్నప్పటికీ చావు రేటు పెరగడం లేదు. మే నెల ఆరంభం నాటికి చావు రేటు 3.2 శాతం మాత్రమే ఉంది. అంటే ప్రతీ 1000మందికి 32మంది చనిపోతున్నారు. ఈ సంఖ్య జూన్ నెల మధ్యలో కాస్త తగ్గింది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ లో నమోదు కాని చావులను బయటపెట్టాయి. దీంతో కాస్త చావు రేటు పెరిగినట్లు అనిపించినా మళ్లీ తగ్గుముఖం పట్టింది.

యూరప్, యూకే, స్పెయిన్, ఇటలీల్లో చావులు అధికంగా ఉండటంతో పోలిస్తే ఇండియాలో నమోదైన ఇన్ఫెక్షన్ రేటుతో పాటు చావు రేటు కూడా తక్కువే. యునైటెడ్ స్టేట్స్ లో చావు రేటు 3.16గా ఉండి ఇండియాను దాటిపోయింది. ఇండియాలో పాజిటివ్ రేట్ విషయంలో ట్రెండ్ కు విరుద్ధంగా పోతుంది. అందరూ టెస్టులు చేయించుకుంటేనే ఇది బయటపడుతుంది. టెస్టులు ఎప్పుడైతే యూనివర్సల్ కావో అప్పటి వరకు దీనిపై ఓ క్లారిటీ రాదు.

ఇండియాలో పాజిటివిటీ రేటు మే ఆరంభం నుంచి పెరుగుతూనే 4.14శాతం నుంచి పెరుగుతూ 9శాతానికి చేరుకుంది. ఇది రెండు కారణాలుగా జరిగి ఉండొచ్చు. ఒకటి వైరస్ విస్తారంటూ వ్యాపిస్తూ ఉండటం, రెండోది టెస్టుల సంఖ్య పెరగడం. ఫలితంగా పాజిటివ్ వచ్చిన కేసులు ఎక్కువ అయిపోయాయి. టెస్టులు ఇంకా టార్గెటెడ్ గ్రూప్స్ పైన జరుగుతూనే ఉన్నాయి.

నాలుగు రోజులు వరుసగా 60వేలకు మించి నమోదవుతున్న కొత్త కేసులతో కరోనా పెరిగిపోతుంటే.. సోమవారం ఒక్క రోజు మాత్రమే 54వేలు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ రోజుల్లో కనీసం ఒక్కో రోజు 7లక్షల శాంపుల్స్ ను పరీక్షించారు. ఆదివారం ఒక్క రోజు మాత్రం 5లక్షల శాంపుల్స్ మాత్రమే టెస్టు చేశారు. వీకెండ్ లో టెస్టుల చేసే రేటు తక్కువగానే ఉంటుంది.