sri lanka crisis: శ్రీ‌లంక‌కు మ‌రో 3.3 ట‌న్నుల అత్య‌వ‌స‌ర వైద్య సామ‌గ్రి పంపిన భార‌త్

'పొరుగు దేశాల‌కు తొలి ప్రాధాన్యం' విధానాన్ని అవ‌లంబిస్తోన్న భార‌త్.. తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌కు భారీగా అత్య‌వ‌స‌ర వైద్య సామ‌గ్రిని పంపింది. శ్రీ‌లంక‌లోని సువాసేరియా అంబులెన్స్ సర్వీస్‌కు ఈ సామ‌గ్రిని అందించామ‌ని ఆ దేశంలోని భార‌త హైక‌మిష‌న‌ర్ గోపాల్ బాగ్లే తెలిపారు.

sri lanka crisis: శ్రీ‌లంక‌కు మ‌రో 3.3 ట‌న్నుల అత్య‌వ‌స‌ర వైద్య సామ‌గ్రి పంపిన భార‌త్

Srilakna

sri lanka crisis: ‘పొరుగు దేశాల‌కు తొలి ప్రాధాన్యం’ విధానాన్ని అవ‌లంబిస్తోన్న భార‌త్.. తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీ‌లంక‌కు భారీగా అత్య‌వ‌స‌ర వైద్య సామ‌గ్రిని పంపింది. శ్రీ‌లంక‌లోని సువాసేరియా అంబులెన్స్ సర్వీస్‌కు 3.3 టన్నుల వైద్య సామ‌గ్రిని అందించామ‌ని ఆ దేశంలోని భార‌త హైక‌మిష‌న‌ర్ గోపాల్ బాగ్లే తెలిపారు. ఈ ఏడాది మార్చిలో భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ కొలంబోలోని సువాసేరియా ప్ర‌ధాన కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు వైద్య సామ‌గ్రి కొర‌త ఉంద‌ని తెలుసుకున్నార‌ని ఆయ‌న అన్నారు.

Uttar Pradesh Violence: యూపీలో హింస్మాత‌క ఘ‌ట‌న కేసు.. 36 మంది అరెస్టు

ఈ నేప‌థ్యంలో శ్రీ‌లంక‌కు భార‌త్ పెద్ద ఎత్తున‌ అత్య‌వ‌స‌ర వైద్య సామ‌గ్రి పంపింద‌ని చెప్పారు. భార‌తీయ నౌక ఘ‌రియ‌ల్ ద్వారా వాటిని పంపిన‌ట్లు వివ‌రించారు. సువాసేరియా అంబులెన్స్ సర్వీస్‌కు 3.3 ట‌న్నుల అత్య‌వ‌స‌ర వైద్య సామ‌గ్రి పంప‌డ‌మే కాకుండా, ప‌లు ఆసుప‌త్రుల‌కు అద‌నంగా వైద్య సామ‌గ్రిని భార‌త్ అందించిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. రెండు నెలల్లో శ్రీ‌లంక‌కు భార‌త్ మొత్తం క‌లిపి 25 ట‌న్నుల ఔష‌ధాలు, వైద్య సామ‌గ్రిని పంపింది. వాటి విలువ 7.96 కోట్ల రూపాయ‌లు ఉంటుంది. అలాగే, బియ్యం, పాల పౌడ‌ర్, కిరోసిన్ వంటి ఇత‌ర నిత్యావ‌స‌రాల‌ను కూడా భార‌త్ భారీగా శ్రీ‌లంక‌కు పంపింది.