India Vaccines: వ్యాక్సిన్‌లు పంపిస్తాం.. మందులు కావాలంటే చెప్పండి

ఆఫ్రికా దేశాలైన మలావీ, ఇథోపియా, జాంబియా, మొజంబిఖ్, గినియా అండ్ లెసోథోలకు కొవీషీల్డ్ ఆర్డర్ క్లియర్ చేసినట్లు తెలిపింది. దాంతోపాటు బొత్సవానా దేశానికి కొవాగ్జిన్ ను పూర్తిగా..

India Vaccines: వ్యాక్సిన్‌లు పంపిస్తాం.. మందులు కావాలంటే చెప్పండి

Omicron Variant

India Vaccines: కేంద్ర ప్రభుత్వం ఇండియాలో తయారుచేసిన వ్యాక్సిన్లను ఒమిక్రాన్ ప్రభావిత దేశాలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కథనం ప్రకారం.. ‘భారతదేశ ప్రభుత్వం ఆఫ్రికాలో కరోనా వేరియంట్ తో ఎఫెక్ట్ అయిన దేశాలకు సహాయం చేసేందుకు రెడీగా ఉన్నామని చెప్పింది. వ్యాక్సిన్ల సరఫరాలో మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను కూడా పంపించ’నున్నట్లు తెలిపింది.

ఆఫ్రికా దేశాలైన మలావీ, ఇథోపియా, జాంబియా, మొజంబిఖ్, గినియా అండ్ లెసోథోలకు కొవీషీల్డ్ ఆర్డర్ క్లియర్ చేసినట్లు తెలిపింది. దాంతోపాటు బొత్సవానా దేశానికి కొవాగ్జిన్ ను పూర్తిగా పంపించగలిగామని.. మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా అత్యవసరాలైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్, టెస్ట్ కిట్స్, గ్లౌజులు, పీపీఈ కిట్లు, మెడికల్ ఎక్విప్మెంట్ అయిన వెంటిలేటర్లు పంపడానికి రెడీగా ఉన్నట్లు తెలిపింది.

కేంద్ర ప్రబుత్వం ఇప్పటివరకూ ఆఫ్రికా దేశాలకు 25మిలియన్ డోసుల వరకూ వ్యాక్సిన్ సప్లై చేసింది. 16దేశాలకు పది లక్షల డోసులు పంపేందుకు రెడీగా ఉంది. కొవాక్స్ ఫెసిలిటీలో భాగంగా 33దేశాలకు 16మిలియన్ డోసులు పంపనుంది.+

…………………………………….: ఒమిక్రాన్ హైరిస్క్ అలర్ట్.. నిఘాలో 600మంది