దాడులు జరగడం ఖాయమేనా: పంజాబ్‌లో పట్టుబడ్డ పాక్ గూఢచారి

  • Published By: vamsi ,Published On : March 1, 2019 / 07:27 AM IST
దాడులు జరగడం ఖాయమేనా: పంజాబ్‌లో పట్టుబడ్డ పాక్ గూఢచారి

వారం రోజులుగా భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. శాంతిని కోరుకుంటున్నామంటోన్న పాక్.. తమ అదుపులో ఉన్న భారత్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్‌ అభినందన్‌ను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక అంతా ప్రశాంతత నెలకొంటుందన్న సమయంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో పాకిస్తాన్ గూఢచారి పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. 
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

ఫిరోజ్‌పూర్‌కు దగ్గర్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) బలగాల ఏర్పాటు సంగతులను ఫొటోల ద్వారా చిత్రీకరిస్తున్న వ్యక్తిని అనుమానించిన బీఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఫోన్, సిమ్ కార్డు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.  

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన వ్యక్తిగా అతనిని గుర్తించారు. నిందితుని నుంచి సేకరించిన ఫోన్ లో నుంచి సిమ్ కార్డుపై ఎంక్వైరీ వేశారు. దాని నుంచి అతను 8 పాకిస్తాన్ గ్రూపులతో కాంటాక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 6 పాకిస్తాన్ ఫోన్ నెంబర్లు కూడా అతని దగ్గర ఉండటం గమనించారు. 
Read Also : ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట : పాక్ డిమాండ్

భారత్‌కు చెందిన త్రివిధ దళాధిపతులు పాక్ కవ్వింపులపై దాడులు జరిపేందుకు మాత్రమే భారత యుద్ధ విమానాలు బయల్దేరాయని గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ దాడుల్లోనే భారత యుద్ధ విమానం మిగ్ 21 ప్రమాదానికి గురవడంతో దాని పైలట్ అభినందన్ వర్తమాన్ పాక్ భూభాగంలో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. 
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే