5th T20 : 7రన్స్ తేడాతో విన్, న్యూజిలాండ్ లో… ఇండియా హిస్టరీ… 5-0తో క్లీన్ స్వీప్

  • Published By: chvmurthy ,Published On : February 2, 2020 / 11:17 AM IST
5th T20 :  7రన్స్ తేడాతో విన్, న్యూజిలాండ్ లో… ఇండియా హిస్టరీ… 5-0తో క్లీన్ స్వీప్

న్యూజిలాండ్ టూర్ అందులోనూ ఐదు T-20లంటే పోటాపోటీగా సాగుతుందని అనుకున్నారు. రిజల్ట్ మాత్రం… ఇండియా చితకొట్టింది. వరుసగా మూడు మ్యాచుల్లో లాస్ట్ ఓవర్ లోనే గెలిచింది. మూడు సార్లు.. గెలవలేదని అనుకున్న ప్రతిసారీ….మేజిక్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారు. ఐదో మ్యాచ్ లో కోహ్లీ లేడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా.. రోహిత్ హాఫ్ సెంచరీతో…163 రన్స్ చేసింది. గ్రౌండ్ బ్యాటింగ్ పిచ్ కాదు. కాకపోతే విలియమ్సన్ లేడు. అలాగని పెద్ద స్కోర్ కూడా కాదు. ఇద్దరు నిలబడితే చేజ్ చేయొచ్చు. అదే జరిగింది.

ముందు మూడు వికెట్లు పడినా.. రాస్ టేలర్ నిలదొక్కున్నాడు. Tim Seifert ఊపుమీదున్నాడు. ఇద్దరు కలసి ఆల్ రౌండర్ దూబేకు చుక్కులు చూపించారు. ఒకే ఓవర్ లో 34 రన్స్ కొట్టారు. రెండు ఫోర్లు….నాలుగు సిక్సర్లు. పాపం. దుబే ఇప్పట్లో ఈ ఓవర్ ను మర్చిపోలేడు. అప్పటిదాకా ఇండియా వైపున్న మ్యాచ్ ఒక్కసారిగా న్యూజిలాండ్ చేతిలో కొచ్చింది.

ఓవర్ కు ఓ ఫోర్ కొడితే చాలు… గెల్చేయొచ్చు. అక్కడ నుంచి మొదలైంది… బుమ్రా బౌలింగ్ మ్యాజిక్. మూడు ఓవర్లు వేశాడు. 12 రన్స్ ఇచ్చాడు….ఇద్దరిని పెవిలియన్ పంపాడు. ఈ దెబ్బకు లాస్ట్ ఓవర్ లో సోధీ రెండు సిక్స్ లు కొట్టినా… న్యూజిలాండ్ గెలవలేకపోయింది.

ప్రతిమ్యాచ్ లోనూ ఇరగదీసిన కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లోనూ 33 బాల్స్ లో 45 రన్స్ కొట్టాడు. ఓపెనర్ గా దిగిన సంజూ సాంసన్ 2 రన్స్ చేశాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన రోహిత్ 60 రన్స్ చేసి…గేర్ మార్చాల్సిన సమయంలో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. శ్రేయష్ నిలబడితే… మనీష్ పాండే చివరి ఓవర్లలో సిక్స్, ఫోర్ కొట్టాడు.

సిరీస్ అంతా KL Rahul బ్యాటింగ్ సౌండ్ వినిపించింది. 224 రన్స్. కీపింగ్ కనిపించింది. అందుకే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఇక రిషబ్ పంత్ కు ఇప్పట్లో ఛాన్స్ లేనట్లే. గాయం తర్వాత మళ్లీ పాత ఫామ్ కొచ్చిన బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

ఈ సిరీస్ లో నాలుగు మ్యాచుల్లో 105 రన్స్ కొట్టినా… ఈ మ్యాచ్ లో ఆడకపోయినా ఇండియా క్లీన్ స్వీప్ అంటే… మిగిలిన కుర్రాళ్లు ఆటను లెక్క వేసుకోవచ్చు. అందుకే టీ-20ల్లో ఇదో హిస్టరీ.