Yudh Abhyas: చైనాకు 100 కి.మీ దూరంలో భారత్-అమెరికా ‘యుద్ధ అభ్యాస్’

చైనా సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో భారత్, అమెరికా ‘యుద్ధ అభ్యాస్’ ప్రారంభించాయి. ఈ 18వ ఎడిషన్‌ వినాస్యాలను ఉత్తరాఖండ్‌లోని ఔలీలో నిర్వహిస్తున్నారు. ‘‘చైనాను ఎదుర్కోవడంలో సన్నద్ధం అయ్యేందుకు భారత్-చైనాకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి. ఎత్తైన పర్వతాలు, తీవ్ర చలి ఉండే వాతావరణంలో 15 రోజుల పాటు ఈ సంయుక్త విన్యాసాలు జరుగుతాయి’’ అని భారత ఆర్మీ ఏడీజీ పీఐ తెలిపారు.

Yudh Abhyas: చైనాకు 100 కి.మీ దూరంలో భారత్-అమెరికా ‘యుద్ధ అభ్యాస్’

Yudh Abhyas: చైనా సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో భారత్, అమెరికా ‘యుద్ధ అభ్యాస్’ ప్రారంభించాయి. ఈ 18వ ఎడిషన్‌ వినాస్యాలను ఉత్తరాఖండ్‌లోని ఔలీలో నిర్వహిస్తున్నారు. ‘‘చైనాను ఎదుర్కోవడంలో సన్నద్ధం అయ్యేందుకు భారత్-చైనాకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి. ఎత్తైన పర్వతాలు, తీవ్ర చలి ఉండే వాతావరణంలో 15 రోజుల పాటు ఈ సంయుక్త విన్యాసాలు జరుగుతాయి’’ అని భారత ఆర్మీ ఏడీజీ పీఐ తెలిపారు.

ప్రతి ఏడాది భారత్‌-అమెరికా నిర్వహించే ఈ సంయుక్త విన్యాసాల్లో యుద్ధ వ్యూహాలు, సంసిద్ధత వంటి పలు అంశాలతో పాటు విపత్తుల సమయంలో ప్రతిస్పందించాల్సిన తీరు, ఇతర విషయాలపై ఇరు దేశాలు దృష్టిపెడతాయి. గత ఏడాది ఈ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరిగాయి.

ప్రస్తుతం జరుగుతున్న విన్యాసాల్లో అమెరికా సైన్యంలోని సెకండ్‌ బ్రిగేడ్‌ తో పాటు ఇండియా నుంచి 11వ అసోం రెజిమెంట్‌ దళాలు పాలు పంచుకుంటున్నాయి. కాగా, ఈ విన్యాసాలపై చైనా స్పందిస్తూ.. సరిహద్దు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని చెప్పుకొచ్చింది. అయితే, చైనా వ్యాఖ్యలపై భారత్‌ దీటుగా సమాధానం ఇచ్చింది. భారత అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విధంగా చైనా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..