ఇండియా పర్యటనకు రెడీ అవుతున్న బైడెన్ టీం

ఇండియా పర్యటనకు రెడీ అవుతున్న బైడెన్ టీం

Biden

Biden India Visit: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ జే ఆస్టిన్ మార్చి నెలాఖరుకు ఇండియా పర్యటనకు రాబోయే ప్లాన్ లో ఉన్నారు. మార్చి 15, మార్చి 25 తేదీలను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. లేదంటే మార్చి 20న కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జనవరి 20న బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటయ్యాక తొలి క్యాబినెట్ ర్యాంక్ అఫీషియల్ విజిట్ ఇదే. ఇది కన్ఫామ్ అయిన కొద్ది రోజులకే డిఫెన్స్ మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్ కు జనవరి 27న కాల్ చేసి మాట్లాడారు. యూఎస్-ఇండియా మేజర్ డిఫెన్స్ పార్టనర్‌షిప్ పై పెంటగాన్ కమిట్మెంట్ కోసం ఈ చర్చలు జరగనున్నాయి.

ఇండో ఫసిఫిక్ రీజియన్ ఫ్రీగా, ఓపెన్ గా ఉంచడమే కామన్ ఇంట్రస్ట్ గా కనిపిస్తుంది. చైనా ప్రో యాక్టివ్ యాక్షన్లకు చెక్ పెట్టేందుకుగా ఇండియన్, అమెరికన్ మిలటరీ, పొలిటికల్ వ్యవస్థలు కొన్నేళ్లుగా చేస్తున్న పని ఇదే.

యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ ఆస్టిన్ పర్యటన కన్ఫామ్ అయిన తర్వాత ప్రెసిడెంట్ బైడెన్, ప్రధాని మోడీ, జపాన్ పీఎం యోషిహిడె సుగా, ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మోరిసన్ లు మార్చి 12న మీటింగ్ కు అటెండ్ అవుతారు.