జిత్తులమారి చైనాపై ముందస్తు వ్యూహం.. ఏ క్షణంలో అయినా యుద్ధానికి రెడీ అంటోన్న ఎయిర్‌ఫోర్స్

జిత్తులమారి చైనాపై ముందస్తు వ్యూహం.. ఏ క్షణంలో అయినా యుద్ధానికి రెడీ అంటోన్న ఎయిర్‌ఫోర్స్

అస్సలు నమ్మలేం.. చైనా బలగాలు.. బోర్డర్ నుంచి 2 కిలోమీటర్లు కాదు.. పూర్తిగా బీజింగ్ దాకా వెళ్లినా నమ్మలేం. డ్రాగన్ జిత్తులమారి వేషాల గురించి తెలిసి కూడా.. ఇండియా ఎలా నమ్ముతుంది.? జూన్ 15న.. వెనక్కి వెళ్లినట్లే వెళ్లి.. రాత్రికి రాత్రి మళ్లీ క్యాంపులు వేసిన చైనా రణనీతిని.. ఇండియన్ ఆర్మీ ఎలా విశ్వసిస్తుంది? అందుకే.. ఇండియన్ ఆర్మీ కాస్త వెనక్కి వచ్చినా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాత్రం తన నిఘాను అలాగే కంటిన్యూ చేస్తోంది. LAC వెంబడి.. చైనా బలగాలు వెనక్కి తగ్గినా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలను నిశితంగా గమనిస్తూ గస్తీ కాస్తూనే ఉంది.

ఈస్ట్ లద్దాఖ్ పర్వతాలపై.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం.. ఇరుదేశాల మధ్య ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలు వెనక్కి తగ్గినా.. ఎయిర్ ఫోర్స్ సన్నద్ధతను, అప్రమత్తతను కొనసాగించాలని.. అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా.. ఈ పాట్రోలింగ్ నిర్వహించినట్లు చెబుతున్నారు. లద్దాఖ్‌తో పాటు పాంగాంగ్ లేక్, గోగ్రా, హాట్‌స్ర్పింగ్స్ సహా.. అన్ని వివాదాస్పద ప్రదేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు.. చైనాపై ప్రెజర్ పెంచాలన్న వ్యూహం అమలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే.. రాత్రి, పగలు యుద్ధ విమానాలతో గస్తీ కొనసాగిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచే ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఫైటర్ జెట్స్, ఎటాక్ చాపర్లు, ట్రాన్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను లద్దాఖ్‌లో మోహరించింది. ఇప్పుడు వాటితోనే.. బోర్డర్లో గస్తీ కాస్తోంది. సరిహద్దు భద్రత విషయంలో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ LAC వెంబడి ఎంతో అప్రమత్తంగా ఉంది.

సుఖోయ్‌ 30ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌ ఫైటర్ జెట్స్‌కి తోడు.. అపాచీ, చినూక్ హెలీకాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. చైనా ఏ మాత్రం తోక జాడించినా.. స్ట్రాంగ్ కౌంటర్ తప్పదన్న సంకేతాలను ఐఏఎప్ పంపుతోంది. సీ-17 గ్లోబ్ మాస్టర్ 3తో పాటు సీ-130J ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా ఐఏఎఫ్ రంగంలోకి దించింది. వీటి ద్వారా.. మిలిటరీ సామాగ్రి, ఆయుధాలు త్వరగా తరలించేందుకు వీలుంటుంది.

భారత్-చైనా మధ్య 3 వేల 5 వందల కిలోమీటర్ల సుదూర సరిహద్దు ప్రాంతం ఉంది. ఇక్కడి నుంచి అక్కడి వరకు.. ఎక్కడ తేడా వచ్చినా.. ఒకేసారి ఎక్కువమంది సైనికులను.. వేగంగా తరలించాలని ఇండియా డిసైడైంది. ఇందుకు వీలుగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. ఇల్యూషిన్-76 ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా సిద్ధంగా ఉంచింది. లద్దాఖ్‌తో పాటు లేహ్, శ్రీనగర్, అవంతిపొర, బరేలీ, అదమ్‌పూర్, హల్వారా, సిర్సా ఎయిర్‌బేస్‌ల్లో.. సుఖోయ్‌ 30ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌-2000 ఫైటర్ జెట్స్‌ సర్వసన్నద్ధంగా ఉన్నాయి.

ప్రస్తుతానికి.. అపాచీ, చినూక్ లాంటి ఎటాక్ చాపర్లు.. మిగ్-17, మిగ్-29, ఏఎన్-23 ఫైటర్ జెట్స్.. కశ్మీర్, ఉత్తరాఖండ్ ఎయిర్‌బేస్‌ల నుంచి రాత్రివేళల్లోనూ గస్తీ నిర్వహిస్తున్నాయి. డ్రాగన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా.. తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయ్.

ఎయిర్‌ఫోర్స్ దాడుల్లో అపాచీ హెలీకాప్టర్లదే కీ రోల్. ఇది.. నిమిషానికి 2 వేల 8 వందల మీటర్ల వేగంతో టేకాఫ్ అవుతుంది. 3 గంటల పాటు నాన్‌స్టాప్‌గా గాల్లో చక్కర్లు కొడుతుంది. ఒక్కసారి ఫ్యూయల్ నింపితే.. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరం దాకా ప్రయాణిస్తుంది. అంతేకాదు.. దీని ద్వారా.. బులెట్లు, బాంబులు, మిస్సైళ్లు కూడా ఫైర్ చేయొచ్చు. అపాచీ హెలికాప్టర్ కిందున్న రైఫిల్‌లో ఒకేసారి 1,200 రౌండ్ల 30ఎంఎం బులెట్లను లోడ్ చేసే వీలుంది.

శత్రువు భూభాగంలో కూడా నిఘా ఆపరేషన్లు నిర్వహించడం దీని స్పెషాలిటీ. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనానా.. ఇది దాడి చేస్తుంది. పైగా.. దీనిలో రెండు ఇంజిన్లు ఉండటం వల్ల.. స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. రాడార్‌లో దీనిని కనిపెట్టడం కూడా చాలా కష్టం.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గర ఇప్పుడు 17 అపాచీ హెలికాప్టర్లున్నాయి. మరో ఆరింటిని కొనుగోలు చేసేందుకు.. 2017లో బోయింగ్ కంపెనీతో 4 వేల 168 కోట్ల ఒప్పందం చేసుకుంది. చైనాతో ఘర్షణ నెలకొన్న పరిస్థితుల్లో.. మిగతా అపాచీ హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా అందజేయాలని.. భారత ప్రభుత్వం అమెరికాను కోరింది.

బోయింగ్ సంస్థ తయారుచేసిన.. అడ్వాన్స్‌డ్ మల్టీ మిషన్ హెలికాప్టర్ చినూక్ కూడా.. ఇప్పుడు LAC వెంబడి గస్తీ కాస్తోంది. గంటకు.. 302 కిలోమీటర్ల వేగం దీని స్పెషాలిటీ. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంది. 20 వేల అడుగుల వరకూ ఎగిరే సత్తా ఉంది. ఒకేసారి 10 టన్నులు మోయగల బాహుబలి ఈ చినూక్.

హిమాలయాల్లాంటి ప్రాంతాల్లోకి కూడా చినూక్ హెలికాప్టర్లు పేలోడ్‌లు మోసుకెళ్లగలవు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గరున్న హెలికాప్టర్ల కంటే ఎక్కువ బరువు మోస్తాయ్. వాహనాలను కూడా మోయగలిగే కెపాసిటీ.. ఈ చినూక్ హెలికాప్టర్లకు ఉంది. ఇవి.. భారత్ దగ్గర 15 ఉన్నాయి.

సరిహద్దుల్లో.. ఎప్పుడే అవసరం వచ్చినా.. టైం వేస్ట్ అవకుండా.. సీ-17 గ్లోబ్ మాస్టర్-3 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా ఐఏఎఫ్ రెడీగా ఉంచింది. ఇది.. సరుకు రవాణా, బలగాల తరలించేందుకు వినియోగిస్తారు. ఎయిర్‌లిఫ్ట్ కార్యకలాపాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీనిలో.. నాలుగు టర్భో ఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. ట్యాంకులు, భారీ వాహనాలను సైతం మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఒకేసారి.. 265 టన్నులను మోసుకెళ్లగలికే శక్తి దీనికుంది. గరిష్టంగా.. గంటకు 830 కిలోమీటర్ల వేగంతో ఇది పనిచేస్తుంది.

ఈ గ్లోబ్ మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి.. 102 మంది పారాట్రూపర్లు.. ఒకేసారి తమ సామాగ్రితో దిగేందుకు వీలుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు 11 వందల మీటర్ల రన్ వే అవసరం. అది.. ఎగుడు, దిగుడుగా ఉన్నా.. సేఫ్‌గా ల్యాండ్ అవుతుంది. లద్దాఖ్ పర్వత ప్రాంతాల్లోనూ ల్యాండయ్యే గ్లోబ్ మాస్టర్ ఇది. థ్రస్ట్ ఇంజిన్ల సాయంతో.. రివర్స్ చేసే శక్తి కూడా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర.. 11 సీ-17 గ్లోబ్ మాస్టర్-3 ఎయిర్ క్రాఫ్ట్‌లున్నాయ్.

ఇలా.. ఇండియా దగ్గరున్న ఎటాక్ చాపర్లు, ఫైటర్ జెట్లు, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లన్నీ.. సిద్ధంగా ఉన్నాయ్. చైనా.. వెనక్కి వెళ్లినట్లే వెళ్లి.. మళ్లీ తిరిగొచ్చే ప్లాన్ వేస్తే.. గట్టిగా తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యాయ్. లద్దాఖ్‌లోని 3 కీలక పాయింట్ల నుంచి.. ఇరు దేశాల ఆర్మీ వెనక్కి తగ్గినా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాత్రం.. అన్ని వేళలా గస్తీ కాస్తూనే ఉంది. పరిస్థితులను రివ్యూ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా.. చైనీస్ ట్రూప్స్ కదలికలను గమనిస్తూనే ఉంది.