దేశ బహిష్కరణ : 2 మామిడిపండ్ల చోరీ కేసులో కోర్టు సంచలన తీర్పు

టైటిల్ చూసి షాక్ అయ్యారా? మామిడి పండ్లు చోరీ చేస్తే దేశ బహిష్కరణ విధించడం ఏంటని విస్తుపోయారా? కానీ ఇది నిజం. దుబాయ్ లో ఈ ఘటన జరిగింది. రెండేళ్ల క్రితం 2

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 12:29 PM IST
దేశ బహిష్కరణ : 2 మామిడిపండ్ల చోరీ కేసులో కోర్టు సంచలన తీర్పు

టైటిల్ చూసి షాక్ అయ్యారా? మామిడి పండ్లు చోరీ చేస్తే దేశ బహిష్కరణ విధించడం ఏంటని విస్తుపోయారా? కానీ ఇది నిజం. దుబాయ్ లో ఈ ఘటన జరిగింది. రెండేళ్ల క్రితం 2

టైటిల్ చూసి షాక్ అయ్యారా? మామిడి పండ్లు చోరీ చేస్తే దేశ బహిష్కరణ విధించడం ఏంటని విస్తుపోయారా? కానీ ఇది నిజం. దుబాయ్ లో ఈ ఘటన జరిగింది. రెండేళ్ల క్రితం 2 మామిడిపండ్లు దొంగలించినందుకు  ఓ భారత కార్మికుడికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోర్టు తీవ్రమైన శిక్ష విధించింది. అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. అంతేకాదు భారీగా జరిమానా కూడా విధించింది.

భారత్ కు చెందిన 27ఏళ్ల వ్యక్తి దుబాయ్ ఎయిర్ పోర్టులో పనిచేసేవాడు. ప్రయాణికుల లగేజీని కంటైనర్ నుంచి కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కించడం.. అక్కడి నుంచి దించడం అతడి డ్యూటీ. 2017 ఆగస్టు 11న ఎయిర్  పోర్టులో డ్యూటీలో ఉండగా ప్రయాణికులకు చెందిన ఓ పండ్ల బాక్స్ నుంచి 2 మామిడిపండ్లు తీసుకున్నాడు. ఇది ఉన్నతాధికారులకు తెలిసింది. వారు దొంగతనం నేరం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణలో దొంగతనం చేసినట్టు అతడు అంగీకరించాడు. అలా చేయడానికి కారణం కూడా చెప్పాడు. ఆ రోజు తనకు బాగా దాహం వేసిందన్నాడు. నీళ్ల కోసం వెతుకుతుండగా.. పండ్ల బాక్స్ కనిపించిదన్నాడు. వెంటనే అందులోని రెండు పండ్లను తీసుకున్నానని వివరించాడు. అయినా అధికారుల మనసు కరగలేదు. నేరం నేరమే అంటూ అతడిపై కేసు పెట్టారు. కేసును విచారించిన కోర్టు సోమవారం(సెప్టెంబర్ 23,2019) తుదితీర్పు ఇచ్చింది. అతడికి 5వేల దిర్హామ్ ల(రూ.96వేలు) ఫైన్ విధించడంతో పాటు దేశ బహిష్కరణ శిక్ష వేసింది. ఈ తీర్పుపై అతడు 15 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. కాగా, ఆ వ్యక్తి దొంగిలించిన రెండు మామిడి పండ్ల విలువ కేవలం రూ.115. ”2018లో పోలీసులు నన్ను ప్రశ్నించారు. నా ఇంట్లో తనిఖీలు చేశారు. చోరీ చేసిన వస్తువులు ఏవీ వారికి కనిపించలేదు” అని బాధితుడు చెప్పాడు. కోర్టు తీర్పు సంచలనంగా మారింది. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తారా అని కామెంట్ చేస్తున్నారు. ఇది టూమచ్ అని చెబుతున్నారు. కాగా, దుబాయ్ లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తప్పు చిన్నదా పెద్దదా అనేది ఉండదు. కఠినమైన శిక్షలు విధిస్తారు. చాలా కేసుల్లో మరణశిక్షలు విధించిన ఘటనలు ఉన్నాయి.