రియల్ హీరో : భారతీయడిపై అమెరికన్ల ప్రశంసల వర్షం

  • Published By: venkaiahnaidu ,Published On : June 4, 2020 / 09:38 AM IST
రియల్ హీరో : భారతీయడిపై అమెరికన్ల ప్రశంసల వర్షం

అమెరికాలో ఇప్పుడు ఓ ఇండియన్-అమెరికన్ వ్యాపారవేత్తపై అక్కడి ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాషింగ్టన్ లోని తన ఇంట్లో 70మంది ఆందోళనకారులకు ఆహారం,నీరు వంటివి అందించి అక్కడి ప్రజల గుండెళ్లో హీరోగా మారాడు. గత వారం మిన్నియాపొలిస్ సిటీ పోలీసుల పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు “జార్జ్‌ ఫ్లాయిడ్‌(46)”కి మద్దతుగా అమెరికాలో ఆఫ్రో-అమెరికన్లు చేస్తున్న నిరసనలు రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతున్న విషయం తెలిసిందే. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలో ఇది ఒకటిగా నిలిచింది.

తమ జాతీయుడుపై జరిగిన దారుణమై హత్యని తట్టుకోలేని నల్లజాతీయులు అమెరికా వ్యాప్తంగా చేపడుతున్న నిరసనలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిరసన కారులని నియంత్రించ డానికి ప్రభుత్వాలు చేయపట్టని చర్యలు లేవు. బాష్ప వాయువులు ప్రయోగించడం ఆందోళన కారులని చెదరగొట్టడం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజధాని వాషింగ్టన్ లో అయితే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు మిలటరీ సిబ్బందికి కూడా రంగంలోకి దిగారు. అవసరమైతే అమెరికా అంతటా వీధుల్లో మిలటరీని రంగంలోకి దించుతా అంటూ ఆందోళనకారులను అధ్యక్షుడు ట్రంప్ తీవ్రస్థాయిలోనే హెచ్చరించినప్పటికీ వారు ఆందోళనలు మాత్రం కొనసాగిస్తున్నారు. కొందరు ఆందోళనకారుల ముసుగులో షాపుల లూటింగ్ కు కూడా పాల్పడుతున్నారు.

ఇదే సమయంలో దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్ట్ లు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే వాషింగ్టన్ లో ఓ ప్రాంతలో ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా కర్ఫ్యూ పాటించే సమయం రావడంతో పోలీసులు నిరసన కారులని అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. దాంతో నిరసన కారులు పరుగులు పెడుతున్న క్రమంలో ఆ ప్రాంతానికి దగ్గరలోనే నివసిస్తున్న భారతీయ వ్యాపారవేత్త రాహుల్ దూబే(44) నిరసన కారులని తన ఇంటిలోకి రమ్మని కోరాడు. మీకు నేను ఆశ్రయం ఇస్తారు రండి అంటూ సుమారు 75 మంది నిరసన కారులకి ఆశ్రయం ఇచ్చారు.

ఆకలితో ఉన్న నిరసన కారులకి అన్నం, పళ్ళు, తినడానికి అన్ని సమకూర్చి పెట్టాడు రాహుల్. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో తెలియడంతో ఒక్క సారిగా అమెరికా మీడియా రాహుల్ పై ప్రశంసలు కురిపించింది. రాహుల్ నిరసన కారుల హీరో అంటూ సంభోదిస్తూ వార్తలు ప్రచురించింది. నిరసన కారులు రాహుల్ ఇంట్లోని సోఫాలలో, రెస్ట్ రూమ్స్ లో సేద తీరారని వారికి రాహుల్ అన్ని సౌకర్యాలు అందించారని తెలిపింది.

గడిచిన 17ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న రాహుల్ దూబే…వాళ్లు హ్యాపీగా ఉండవచ్చు లేదా ఇరుకుగా ఉన్న కారణంగా వాళ్లు హ్యాపీగా ఉండకపోవచ్చు కానీ వాళ్లు సేఫ్ గా ఉన్నారని, వాళ్ల మొఖంలో ఆనందం కనిపించిందని అన్నారు. రాహుల్ నిజంగా చాలామంది ప్రాణాలను కాపాడాడని “నల్లగా ఉన్నవారి జీవితాలు కూడా విలువైనవే”అని పోరాటం చేస్తున్న కార్యకర్త ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాహుల్ అద్భుతమైన వ్యక్తి అని,ధన్యవాదాలు చెప్పారు. 

Read: 40 మంది స్కూల్‌ విద్యార్థుల‌ను క‌త్తితో పొడిచేసిన సెక్యూరిటీ గార్డ్