job slapping the owner : ఓనర్ ని చెంప దెబ్బలు కొట్టే ఉద్యోగం..ఫేస్‌బుక్ వాడితే చెంప చెళ్లుమనిసిస్తుంది

ఆమె చేసేది ఓనర్ ని చెంప దెబ్బలు కొట్టే ఉద్యోగం..యజమాని ఫేస్‌బుక్ వాడితే చెంప చెళ్లుమనిసిస్తుంది. కొట్టటానికే ఆమెకు జీతం ఇస్తున్నాడు ఓ కంపెనీ ఓనర్.

job slapping the owner : ఓనర్ ని చెంప దెబ్బలు కొట్టే ఉద్యోగం..ఫేస్‌బుక్ వాడితే చెంప చెళ్లుమనిసిస్తుంది

Job Slapping The Owner

Man Hires Woman To Slap Him Every Time He is On Facebook : ఉద్యోగాల్లో ఇటువంటి ఉద్యోగం కూడా ఉంటుందా? అనిపించే వింతైన ఉద్యోగం అది. చూశారా ఇప్పటికే ఉద్యోగం అని వాడాల్సి వచ్చిందో? అదే మరి ఈ వింతైన ఉద్యోగ వార్త. ఏంటా ఉద్యోగం అంటే..తనను పనిలో పెట్టుకున్న ఓనర్ గారి చెంప చెళ్లుమని కొట్టే ఉద్యోగం..! వినటానికే వింతగా ఉంది కదూ. నిజమే. ఓ వ్యక్తి తనను చెంపదెబ్బలు కొట్టటానికి ఓ మహిళలను పనిలో పెట్టుకున్నాడు. ఆమె తనను పనిలో పెట్టుకున్న వ్యక్తి ఫేస్ బుక్ వినియోగిస్తే చాలు చెంప కందిపోయేలా చెళ్లుమని ఒక్కటిస్తుంది. అదే మరి ఆమె ఉద్యోగం..ఇదేందిరా బాబు ఎవరైనా కొడితే కోపమొస్తుంది. ఈయనెవర్రా బాబూ కొట్టటానికి మనిషి పెట్టి మరీ కొట్టించుకుంటున్నాడనిపిస్తోంది. మరి ఆ కథాకమామీషు ఏంటో చూసేద్దాం..అదే తెలిసేసుకుందాం..

Read more :  Crazy Job News : మంచంపై హాయిగా పడుకుంటే చాలు..రూ.25 లక్షల జీతం..!

అతను భారతీయ-అమెరికన్ మనేష్ సేథి. తనని చెంపదెబ్బ కొట్టడానికి ఒక మహిళను పనిలో పెట్టుకున్నాడు. ఇది గతంలో ఓ సారి వైలర్ అయ్యింది. ఇప్పుడు తాజాగా మరోసారి ట్రెండ్ అవుతోంది. దానికి కూడా కారణం లేకపోలేదు..ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలలో ఒకరైన బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందిస్తూ రెండు ఫైర్ ఏమోజీలను పోస్టు చేశారు. దీంతో అదికాస్తా మరోసారి ట్రెండింగ్ గా మారింది.

భారతీయ-అమెరికన్ అయిన మనేష్ సేథి వేరబుల్ డివైసెస్ బ్రాండ్ పావ్ లోక్ వ్యవస్థాపకుడు. ఫేస్ బుక్ అంటే ఇష్టం. ఎక్కువగా ఫేస్ బుక్ లోనే ఉంటాడు. ఎంతగా అంటే ఆఫీసు వర్కింగ్ సమయంలో కూడా ఫేస్ బుక్ లో మునిగిపోతుంటాడు. చాటింగులు,పోస్టింగ్ లు దీంతో టైవ్ వేస్ట్ అవుతోంది.దీనివల్ల అతని కంపెనీ మీద ఎక్కువ ప్రభావం పడింది. ఆ విషయాన్ని సేథి గుర్తించారు.దానికోసం ఓ ఐడియా వేశాడు.

Read more : Job offer : క్యాబేజీ కట్ చేసి ప్యాక్ చేస్తే చాలు..ఏడాదికి రూ.63 లక్షల జీతం..

అందుకే ఓ మహిళను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. తాను పనిచేస్తున్న టైమ్ లో ఫేస్‌బుక్ వినియోగించిన ప్రతిసారీ అతని ముఖంపై చెంపదెబ్బ కొట్టడానికి ఒక మహిళను పనిలో పెట్టుకోవాలనుకున్నాడు. దాని కోసం యుఎస్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్ మెంట్స్ వెబ్ సైట్ క్రెయిగ్స్లిస్ట్ లో ఒక ప్రకటన కూడా ఇచ్చాడు. “నేను పనివేళల్లో సమయాన్ని వృధాచేసినప్పుడు మీరు నాపై అరవాలి..అవసరమైతే కొట్టాలి” ఇది 2012లో జరిగింది. ఈ ఉద్యోగం కోసం ఎంపికైన వారికి గంటకు $8 డాలర్లు ఇస్తాను అన్నాడు. ఆ ఉద్యోగం కోసం సేథి ఇంటర్వ్యూలు చేయగా..కారా అనే మహిళా సెలెక్ట్ అయ్యింది. అలా సేథి ఫేస్ బుక్ యూజ్ చేయటానికి ఓపెన్ చేసినప్పుడల్లా కారా సేథిని గట్టిగా అరిచి చెప్పేది. అప్పటికి వినకపోతే సేథి చెంప చెళ్లు మనిపించేది. స్లాపర్ కారాను నియమించుకున్న తరువాత మంచి ఫలితాలను వచ్చాయని మనేష్ సేథి చెప్పటం విశేషం.

Read more : US Job : CC టీవీ ఫుటేజ్ చూడటమే జాబ్..నెలకు రూ.30 వేల జీతం

ఈ సందర్భంగా సేథి మాట్లాడుతు..నా సగటు ఉత్పాదకత 35-40% ఉండేది. కానీ, స్లాపర్ కారా నా పక్కన కూర్చున్నాక నా ఉత్పాదకత 98%కి పెరిగింది” అని సేథి తన బ్లాగులో రాశారు. ఈ కథకమామీషు 2012లో జరిగిందే అయినా మరోసారి ట్రెండ్ గా మారింది. ట్రెండ్ అవుతున్న పోస్టుపై టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ స్పందిస్తూ రెండు ఫైర్ ఏమోజీలను పోస్టు చేశారు. దీంతో మరింత ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఈ వీడియోను ఒకసారి చూడండి.