పాక్ ఆఫీసర్ సమాధిని బాగుచేసి డెకరేట్ చేసిన ఇండియన్ ఆర్మీ

10TV Telugu News

శిథిలావస్థకు చేరుకున్న పాకిస్తానీ ఆఫీసర్ సమాధిని బాగుచేయడంతో పాటు డెకరేట్ కూడా చేసింది Indian Army. జమ్మూ అండ్ కశ్మీర్ లోని నౌగం సెక్టార్ లో జరిగిన ఈ ఘటనను ఫొటో రూపంలో పంచుకుంది ఇండియన్ ఆర్మీ. శ్రీనగర్ కు చెందిన చినార్ కార్ప్స్ ఎపితాఫ్ యొక్క ఫొటోను ట్వీట్ చేసింది.

‘మేజర్ మొహమ్మద్ షబీర్ ఖాన్ జ్ఞాపకార్థంగా సితార్ ఏ జుర్రాట్ షహీద్ 1972లో మే 5న వీరమరణం పొందారు.‘సంప్రదాయాలు, పద్ధతి ప్రకారం.. ఇండియన్ ఆర్మీ, చినార్‌కార్ప్స్ పాడైపోయిన మేజర్ మొహమ్మద్ షబ్బీర్ ఖాన్ సమాధిని బాగు చేశారు. నౌగాం సెక్టార్ లో 1972 మే 5న ఎల్సీ గుండా ఫార్వార్డ్ లొకేషన్ లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందారు’ అని చినార్ కార్ప్స్ ట్విట్టర్లో పోస్టు చేసింది.

దేశంతో సంబంధం లేకుండా వీరమరణం పొందిన సైనికుడికి గౌరవం ఇవ్వాలి. ఆ నమ్మకంతోనే ఇండియన్ ఆర్మీ బతుకుతుంది. ప్రపంచం కోసం ఇండియన్ ఆర్మీ పాటించే విధానం ఇది’ అని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.