లండన్ స్కూళ్లల్లో ఉచిత భోజనం అందిస్తున్న భారత ఛారిటీ

  • Published By: sreehari ,Published On : October 28, 2020 / 04:02 PM IST
లండన్ స్కూళ్లల్లో ఉచిత భోజనం అందిస్తున్న భారత ఛారిటీ

free school meals : భారతీయ పిల్లల పేదిరక స్వచ్చంధ సంస్థ ఇంగ్లండ్‌‌లోని స్కూళ్లలో చిన్నారులకు ఉచితంగా భోజనాన్ని ఆఫర్ చేస్తోంది. హాలీడే హంగర్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా వ్యాట్ ఫోర్డ్‌లోని కొత్త కిచెన్ నుంచి ఈ స్వచ్చంధ సేవా సంస్థ స్కూళ్లలో ఉచితంగా భోజనాన్ని పంపిణీ చేసింది.



ఉత్తర లండన్ లోని స్కూళ్లలో ఆకలితో ఉన్న చిన్నారుల కోసం హాట్ వెజిటేరియన్ వంటకాలను తయారుచేసింది. ఒక్కో వంటకం 2 పౌండ్లు కంటే చాలా తక్కువ ఉంటుంది. అక్షయ్ పాత్ర ఛారిటీలో పనిచేసే చెఫ్‌లతో ట్రేలలో వేడివేడిగా క్యాలిఫ్లవర్ చీజ్, మిక్సడ్ వెజిటేబుల్ పాస్తాను తయారుచేశారు.



ఈ ఛారిటీ ద్వారా భారతదేశంలో ప్రతిరోజు స్కూళ్లలో 1.8 మిలియన్ల భోజనాలను అందిస్తోంది. ఒక రోజులో 9,000 మీల్స్ తయారుచేసేందుకు వీలుగా క్రికెల్ వుడ్‌లోని మోరా ప్రైమరీ స్కూళ్లో కిచెన్ రూపొందించారు. స్కూళ్లలో విద్యార్థుల కోసం ఈ మీల్స్ ను కేట్ బాస్ అనే టీచర్.. ప్రతిరోజు తన కారులో తీసుకెళ్లుతోంది.



భారత్ మాదిరి కిచెన్‌లను లిచెస్టర్, ఈస్ట్ లండన్ ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయాలని ఛారిటీ ప్లాన్ చేస్తోంది. క్రిస్మస్ హాలీడేస్‌లో కూడా స్కూళ్లకు ఉచితంగా భోజనాన్ని అందించాలని భావిస్తోంది. ఒక పోర్షన్ 2 పౌండ్లు కంటే తక్కువగా స్కూళ్లకు భోజనాలను విక్రయించాలని ఛారిటీ లక్ష్యంగా పెట్టుకుంది.



ఇందులో కొంత మొత్తం రాష్ట్రం చెల్లిస్తే.. మిగిలిన సగాన్ని డోనర్లు చెల్లించారు. యూకేలో పిల్లల్లో ఆకలి సమస్యలు ఎక్కువగా ఉండేవి. అందుకే భారత మాదిరిగా పిల్లల్లో ఆకలిని తీర్చేందుకు ఈ కొత్త టెక్నాలజీని అమల్లోకి తీసుకురావడం జరిగిందని GMSP ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ Sonal Sachdev Patel తెలిపారు.