Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య..విచారం వ్యక్తం చేసిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్

తాను 2019లో జపాన్ పర్యటన సందర్భంగా అబేని కలిశానని తెలిపారు. సురక్షితమైన మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న స్ఫూర్తిదాయక నాయకుడు షింజో అబే అని కొనియాడారు. రాజనీతిజ్ఞతతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.

Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య..విచారం వ్యక్తం చేసిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh

Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే..దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. షింజో అబే హత్య పట్ల భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేసిన ఒక సన్నిహిత మిత్రుడిని భారతదేశం కోల్పోయిందన్నారు.

తాను 2019లో జపాన్ పర్యటన సందర్భంగా అబేని కలిశానని తెలిపారు. సురక్షితమైన మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న స్ఫూర్తిదాయక నాయకుడు షింజో అబే అని కొనియాడారు. రాజనీతిజ్ఞతతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.

Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

దుండగుడు జరిపిన కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందారు. కాల్పుల్లో తీవ్ర గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షింజో అబే ప్రాణాలు విడిచినట్లు జపాన్ మీడియా ప్రకటించింది. వెస్టరన్ జపాన్ లో శుక్రవారం ఉదయం షింజో అబేపై దుండగుడు కాల్పులు జరిపాడు.

సభలో ప్రసంగిస్తుండగా షింజోపై దుండుగుడు కాల్పులు జరిపాడు. ఉదయం 8 గంటల 29 నిమిషాల సమయంలో షింజో పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా వెనుక నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు.

Shinzo Abe Died : దుండగుడి కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి

షింజో అబే ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. కాల్పులు జరిపన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్​కు సుదీర్ఘకాలంగా ప్రధానిగా అబే పని చేశారు. 2020లో ఆరోగ్య కారణాలతో ప్రధాని పదవి నుంచి అబే తప్పుకున్నారు.