Indian Embassy Ukraine : కేంద్రం కీలక నిర్ణయం.. యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తరలింపు

యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని(Indian Embassy Ukraine ) తాత్కాలికంగా పోలాండ్ కు మార్చాలని నిర్ణయించింది. యుక్రెయిన్‌లో వేగంగా క్షీణిస్తున్న..

Indian Embassy Ukraine : కేంద్రం కీలక నిర్ణయం.. యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తరలింపు

Indian Embassy

Indian Embassy Ukraine : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు.. యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అన్ని వైపుల నుంచి రష్యా సేనలు దాడులనకు దిగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్ కు మార్చాలని నిర్ణయించింది. యుక్రెయిన్‌లో వేగంగా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమ ప్రాంతాల్లో రష్యా దాడుల దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్ లో పరిణామాల ఆధారంగా నిర్ణయాలుంటాయని కేంద్ర విదేశాంగ శాఖ ఇదివరకు తెలిపింది.(Indian Embassy Ukraine )

యుక్రెయిన్‌ పశ్చిమ భాగానికి కూడా రష్యా సైనిక చర్యలు విస్తరించాయి. తాజాగా పొలాండ్‌ సరిహద్దుల్లోని ల్వీవ్‌ దగ్గరున్న సైనిక స్థావరంపై రష్యా బలగాలు ఆదివారం క్షిపణి దాడులు చేసినట్లు యుక్రెయిన్‌ తెలిపింది. ఇవనోవ్‌ ఫ్రాంకోవిస్క్‌ మిలటరీ ఎయిర్‌బేస్‌పై క్షిపణులతో దాడులు చేశారని, ఈ దాడుల్లో 9మంది మరణించగా, 57 మంది గాయపడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. యుక్రెయిన్‌లోనే అతిపెద్ద సైనిక శిక్షణ కేంద్రాల్లో ఇదీ ఒకటి. ఈ దాడుల్లో లుట్స్క్‌ ఎయిర్‌ పోర్టు బాగా దెబ్బతింది. ఉక్రెయిన్‌లోని సాంస్కృతిక కేంద్రమైన ల్వీవ్‌ నగరంలో యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ కూడా ఉంది. వేలాది మంది యుక్రెయిన్లు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ల్వీవ్‌పై కూడా దాడులు జరగడంతో మరో సురక్షిత స్థానం కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారని యుక్రెయిన్‌ మిలటరీ తెలిపింది.(Indian Embassy Ukraine )

యుక్రెయిన్‌లో రోజురోజుకి క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత రాయాబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పొరుగున ఉన్న పోలాండ్‌కి తరలించాలని కేంద్రం నిర్ణయించింది. యుక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతాలపై దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత పభ్రుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితులు మెరుగైన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామంది.

Russia : యుక్రెయిన్‌ పై యుద్ధం.. వ్యూహం మార్చిన రష్యా

రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు రష్యా మరింత భీకరంగా దాడులకు దిగుతోంది. యుక్రెయిన్ నగరాలన్నీ బాంబు, క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరిస్తే పుతిన్‌తో తాను చర్చలకు సిద్ధమని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా దురాక్రమణ తర్వాత ఇప్పటివరకు 1,300 మంది సైనికులు మరణించారని యుక్రెయిన్ తెలిపింది.

యుక్రెయిన్‌కు పశ్చిమ దేశాల ఆయుధాల సరఫరాను తమ సేనలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి సెర్గీ ర్యాబ‌కోవ్ చెప్పారు. కాగా, రష్యా దళాలు యుక్రెయిన్ రాజధాని కీవ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఎల్‌వివ్, ఖేర్సన్ నగరాలపై రష్యా దళాలు బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నట్టు ‘కీవ్ ఇండిపెండెంట్’ తెలిపింది. యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా.. రసాయన ఆయుధాలను వినియోగించే అవకాశం ఉందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Russia Putin : యుక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేది లేదంటున్న పుతిన్‌

రష్యా దాడులతో యుక్రెయిన్ లోని మరియుపోల్ పట్టణంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పెద్దఎత్తున అమాయక పౌరులు రష్యా సైనిక దాడులకు బలైపోతున్నట్టు తెలుస్తోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటికే 1,500మందికి పైగా పౌరులు మరణించి ఉంటారని అక్కడి అధికారిక లెక్కలే చెబుతున్నాయి.