Cough Syrup 66 Children Died : దగ్గు మందు తాగి 66 మంది చిన్నారుల మృతి

గాంబియాలో విషాదం నెలకొంది. దగ్గు మందు తాగడం వల్ల 66 మంది చిన్నారులు మృతి చెందారు. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, 66 మంది చిన్నారుల మృతికి కారణమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Cough Syrup 66 Children Died : దగ్గు మందు తాగి 66 మంది చిన్నారుల మృతి

Cough Syrup 66 Children Died

Cough Syrup 66 Children Died : గాంబియాలో విషాదం నెలకొంది. దగ్గు మందు తాగడం వల్ల 66 మంది చిన్నారులు మృతి చెందారు. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, 66 మంది చిన్నారుల మృతికి కారణమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రొమెథజైన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్స్‌మాలిన్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మేకాఫ్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మాగ్రిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిరప్‌ అనే నాలుగు ఔషధాలపై డబ్ల్యూహెచ్‌వో మెడికల్‌ ప్రొడక్ట్‌ అలర్ట్‌ జారీ చేసింది. వీటిలో పరిమితికి మించి డైథిలిన్‌ గ్లైకోల్‌, ఇథిలిన్‌ గ్లైకోల్‌ ఉన్నట్టు గుర్తించారు. ఇవి పరిమితి దాటితే విషపూరితంగా మారుతాయని మెడికల్‌ ప్రొడక్ట్‌ అలర్ట్‌లో పేర్కొన్నారు.

Andhra pradesh: వైద్యం వికటించి బాలింత మృతి

గాంబియా దుర్ఘటనపై సంబంధిత భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఉత్పత్తులు సురక్షితం కాదని, వాటి ఉపయోగం మరణాలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ప్రొడక్టులను గుర్తించి, అమ్మకాల నుంచి తప్పించాలని సూచించింది. కాగా, చిన్నారుల మరణాలపై స్పందించేందుకు మైడెన్‌ ఫార్మా సంస్థ నిరాకరించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.