Plant Fungi : ప్రపంచంలోనే తొలిసారి మనిషికి సోకిన ‘వృక్ష శిలీంధ్రం’.. బాధితుడు భారతీయ పరిశోధకుడే

ప్రపంచంలోనే తొలిసారి ఓ మనిషికి ‘వృక్ష శిలీంధ్రం’. సోకింది. బాధితుడు భారతీయుడే కావటం గమనించాల్సిన విషయం.

Plant Fungi : ప్రపంచంలోనే తొలిసారి మనిషికి సోకిన ‘వృక్ష శిలీంధ్రం’.. బాధితుడు భారతీయ పరిశోధకుడే

Indian man world first human infected ..plant fungus

Plant Fungi : ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తు మానవాళి మనుగడను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు నాలుగేళ్లుగా కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న ప్రజలు కోవిడ్ కొత్త వేరియంట్లతో పాటు సీజనల్ గా వచ్చే పలు వ్యాధులతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలోనే తొలిసారి ఓ వృక్ష సంబంధిత శిలీంధ్రం మనిషికి సోకింది. మొక్కలకు సంబంధించిన ఈ శిలీంధ్రం మనిషికి సోకటం ప్రపంచంలోనే తొలిసారిగా జరిగింది. పైగా ఈ తొలికేసు భారత్ లోనే వెలుగులోకి వచ్చింది. భారత్ కు చెందిన 61 ఏళ్ల పరిశోధకుడికి ప్రాణాంతకమైన మొక్కల శిలీంధ్రం సోకి తీవ్ర అనారోగ్యానికి కారణమైంది.

కోల్ కతాకు చెందిన మొక్కల సంబంధిత శిలీంద్రాలపై పనిచేసే ఓ పరిశోధకుడి(Plant Mycologist)కి ఈ శిలీంధ్రం సోకింది. ప్రపంచంలోనే ఇటువంటి కేసు మొదటిది కావటం గమనించాల్సిన విషయం. వృక్షాల్లో ‘సిల్వర్‌ లీఫ్‌(Silver Leaf)’ వ్యాధికి కారణమయ్యే ‘కొండ్రోస్టీరియం పోర్పోరియమ్‌’ అనే శిలీంధ్రం..61 ఏళ్ల పరిశోధకుడికి సోకింది.

ఈ ప్రభావంతో సదరు బాధితుడికి గొంతు బొంగురుపోవటం, దగ్గు,ఆయాసం, అలసట, ఆహారం మింగటంలో తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. కోల్ కతాలోని అపోలోలో సదరు వ్యక్తికి చికిత్స అందించారు డాక్టర్లు. వృత్తిపరంగా వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న సదరు వ్యక్తికి మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ లేవు. పరిశోధనల్లో భాగంగా సదరు వ్యక్తి కుళ్లిపోతున్న పదార్ధాలతో కూడా పనిచేయాల్సి రావటంతో ఈ అరుదైన ఈ మొక్కల శిలీంధ్రం సోకిందని నిపుణులు భావిస్తున్నారు.

Immortality : ఇక చావు అనేదే ఉండదు.. మరణం లేని జీవితం సాధ్యమే!

ముందస్తు జాగ్రత్తగా బాధిత పరిశోధకుడికి పలు పరీక్షలు చేశారు. దీంతో అతని మెడ వద్ద కణితి ఉన్నట్లుగా ఎక్స్ రేలో గుర్తించారు. దాన్ని వెంటనే సర్జరీ ద్వారా తొలగించారు. ఆతరువాత మరోసారి ఎక్స్ రే తీయగా కణితికి సంబంధించిన ఎటువంటి అసాధారణ పరిస్థితులు లేనట్లుగా గుర్తించి ఊపిరి తీసుకున్నారు సర్జన్లు. సర్జరీ తరువాత కోలుకున్న పరిశోధకుడు ప్రస్తుతం పూర్తి క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. కానీ ఈ వ్యాధి పునరావృతం కాకుండా ఉంటుందనే గ్యారంటీ ఇవ్వలేమని తెలిపారు.

ఆయన కోలుకున్నాక అన్ని పరీక్షలు చేయగా ప్రస్తుతం అతని శరీరంలో ఎటువంటి ఫంగస్ ఆనవాళ్లు లేవని మాత్రం తెలిపారు. కణితిలోని చీము నమూనాలను సేకరించి తదుపరి పరీక్షలకు పంపించామని తెలిపారు. WHO సహకార కేంద్రం ఫర్ రిఫరెన్స్ అండ్ రీసెర్చ్ ఆన్ మెడికల్ ఇంపార్టెన్స్ కు నమూనాలను పంపించామని తెలిపారు. కాగా..వృక్షసంబంధిత శిలీంధ్రాల ద్వారా మనుషులకు వ్యాధి సోకే అవకాశాలుంటాయని..వాటినికి గుర్తించే విధానాల అవసరాన్ని..ఈకేసు చాటిచెబుతోందని డాక్టరలు తన నివేదికలో పేర్కొన్నారు.