ఆర్ధికశాస్త్రంలో భారతీయునికి నోబెల్ బహుమతి

  • Published By: vamsi ,Published On : October 14, 2019 / 10:39 AM IST
ఆర్ధికశాస్త్రంలో భారతీయునికి నోబెల్ బహుమతి

ఆర్ధికశాస్త్రంలో భారతీయుడికి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌, మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. కోల్‌కతాలో జన్మించిన అభిజిత్ బెనర్జీ అంతర్జాతీయంగా పేదరికాన్ని ఎదుర్కొనే అంశంలో పరిష్కారాలు చూపినందుకు ఈ పురస్కారం ఆయనకు దక్కింది.

భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడిన అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లో మరియు మైఖేల్ క్రెమెర్ సంయుక్తంగా 2019 ప్రపంచ నోబెల్ ఎకనామిక్స్ బహుమతిని గెలుచుకున్నారు. 2015లో అభివృద్ధి అజెండా తయారు చేయడం కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఉన్నతస్థాయి ప్రముఖ వ్యక్తుల ప్యానెల్లో ఆయన సభ్యులుగా ఉన్నారు. 

58 ఏళ్ల బెనర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు, అక్కడ 1988లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్‌లో ఆయన ప్రొఫెసర్‌గా ఉన్నారు.