Anita Anand: కెనడా రక్షణ శాఖ మంత్రిగా అనితా ఆనంద్.. మరోసారి భారత సంతతికే

కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది. ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ.. 54 ఏళ్ల వయస్సున్న అనితాను నూతన రక్షణ మంత్రి

Anita Anand: కెనడా రక్షణ శాఖ మంత్రిగా అనితా ఆనంద్.. మరోసారి భారత సంతతికే

Anita Anand

Anita Anand: కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది. ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ.. 54 ఏళ్ల వయస్సున్న అనితాను నూతన రక్షణ మంత్రిగా మంగళవారం నియమించారు. భారత సంతతికే చెందిన హర్జీత్‌ సజ్జన్‌ స్థానంలో కెనడా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మహిళకు కీలక పదవి దక్కింది. సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తిని రక్షణ శాఖ నుంచి తప్పించి ఆ బాధ్యతలను అనితా ఆనంద్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సజ్జన్‌ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించారు.

లైంగిక వేధింపుల ఆరోపణలకు బదులుగా యాక్షన్ తీసుకోవాలని కెనడా మిలటరీపై ఒత్తిడి పెరిగింది. ఉన్నపళంగా బదిలీలు జరిగాయంటోంది కెనడా మీడియా. అనితా ఆనంద్ రక్షణ శాఖ మంత్రిగా ఉంటే కెనడా మిలీటరీలో ఒత్తిడి తగ్గుతుందని పేరును ముందుకొచ్చారట.

……………………………………….: భలే జాక్‌పాట్..!! 75కేజీల చేప రూ.36లక్షలు

న్యాయవాదిగా.. రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన 54 ఏళ్ల అనితా.. కెనడాలోని ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ నుంచి 46శాతం ఓట్లతో విజయం సాధించారు. కార్పొరేట్ లాయర్‌గా ప్రస్థానం ఆరంభించి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజా సేవల మంత్రిగా, వ్యాక్సిన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో సమర్థంగా వ్యవహరించారనే గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతోపాటు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది.