మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని పక్కనపెట్టేసి కరోనాపై పోరుకు దిగిన భారత సంతతి వైద్యురాలు 

  • Published By: veegamteam ,Published On : April 7, 2020 / 11:53 PM IST
మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని పక్కనపెట్టేసి కరోనాపై పోరుకు దిగిన భారత సంతతి వైద్యురాలు 

కరోనా వైరస్‌పై పోరాడేందుకు 2019లో మిస్ ఇంగ్లాండ్ కిరీటం గెలిచిన భారత సంతతి వైద్యురాలు భాషా ముఖర్జీ తిరిగి యుకేకు వచ్చారు. కరోనాపై కొనసాగే పోరాటంలో ముందుండి తన సేవలు అందించేందుకు వచ్చారు. గత ఏడాదిలో మిస్ వరల్డ్ పోటీ పూర్తి చేసిన తర్వాత ముఖర్జీ తిరిగి విదేశాలకు వెళ్లిపోయారు. తన వైద్య వృత్తికి విరామం ఇచ్చిన ఆమె అక్కడే ఓ చారిటీపై ఫోకస్ పెట్టారు.

ఇప్పుడు తన అవసరం ఉందని భావించిన భాషా ముఖర్జీ తిరిగి యుకెలో అడుగుపెట్టినట్టు మీడియాకు తెలిపింది. మెడికల్ ప్రొఫెషనల్స్ కు తన వంతు సాయం అందించనున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతుంటే తన తోటి వైద్య సిబ్బంది కరోనా బాధితుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆమె తెలిపింది. (భారత్ లో 4789 కు చేరిన కరోనా కేసులు… 124 మంది మృతి )

ఇలాంటి పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో మెలగాల్సిన అవసరం ఉందని, మిస్ ఇంగ్లాండ్ కిరీటం ధరించడంలో అర్థం లేదని చెప్పింది. అందుకే మిస్ కిరీటం పక్కన పెట్టేసి తన వైద్యవృత్తితో కరోనా బాధితుల సాయం చేయాల్సిందిగా నిర్ణయించుకున్నట్టు పేర్కొంది.

యుకెలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ఒకప్పటి తోటి వైద్యులంతా తనకు యుకేలో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మెసేజ్ లను పంపుతున్నారని తెలిపింది. అందుకే తాను తిరిగి యుకే రావాలనుకున్నాని చెప్పింది. ఇప్పుడు ఆమె ఒక వారం నుంచి రెండు వారాల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాల్సి ఉంది. ఈ ఐసోలేషన్ పిరియడ్ ముగిసిన వెంటనే భాషా ముఖర్జీ ఫిలిగ్రిమ్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేయనుంది. 

మిస్ ఇంగ్లాండ్ గా ఇంతకంటే మరో మంచి సమయం ఉండదని, ఇంగ్లాండ్ కు అవసరమైన సాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ముఖర్జీ అభిప్రాయపడింది. 8 ఏళ్ల వయస్సులోనే ముఖర్జీ కోల్ కతా నుంచి యుకేకు వెళ్లిపోయంది. అక్కడే శ్వాసకోస వైద్యంలో స్పెషలిస్టుగా ప్రావీణ్యం పొందారు.

అనేక స్వచ్ఛంద సంస్థలకు అంబాసిడర్ గా కూడా పనిచేశారు. కొంతకాలం పాటు తన వైద్యవృత్తికి విరామం తీసుకున్నారు. ఓ కమ్యూనిటీ ఛారిటీ కోసం మార్చిలో భారతదేశంలోనే ముఖర్జీ ఉన్నారు. అంతేకాదు.. ఆఫ్రికా, టర్కీ, పాకిస్థాన్, ఇతర ఆసియా దేశాలను కూడా ముఖర్జీ సందర్శించారు.