Oxford University స్టూడెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలిగా భారత సంతతి విద్యార్థిని విజయం

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని అన్వీ భుటానీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించింది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఈ జరిగిన ఎన్నికల్లో భూటానీ ఈ ఘనత సాధించింది.

Oxford University స్టూడెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలిగా భారత సంతతి విద్యార్థిని విజయం

Indian Student Anvee Bhutani

Indian student Anvee Bhutani : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని అన్వీ భుటానీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించింది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఈ జరిగిన ఎన్నికల్లో భూటానీ ఈ ఘనత సాధించింది. కాగా గత ఫిబ్రవరిలో వర్శిటీలో విద్యార్థి ఎన్నికలు జరిగగా..ఈ ఎన్నికల్లో భారత విద్యార్థిని రష్మీ సమంత్ గెలుపొందారు. కానీ రష్మీ సుమంత్ విద్యార్థి సంఘం నాయకురాలిగా తప్పుకుంది. ఈ క్రమంలో ఉప ఎన్నిక జరిగింది.

ఈ ఎన్నికల్లో 11 మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఈ స్థాయిలో పోటీ పడటం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయినప్పటికీ అన్వీ భుటానీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అన్వీ ప్రస్తుతం యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న మ్యాగ్ డాలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్సెస్ లో పీజీ చదువుతున్నారు. ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఈ ఎన్నికల పోటీల్లో పాల్గొన్న అన్వి భుటానీ..విద్యార్ధులకు మేలు కలిగే కొన్ని కీలక నిర్ణయాలను అమలు చేస్తానని మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వటంతో ప్రభావితమైన విద్యార్దులు అన్వికి ఓట్లు వేయగా ఆమె విజయం సాధించింది. విద్యార్దులకు రావాల్సిన స్టైఫండ్, క్రమశిక్షణా చర్యలు, ప్రొఫెసర్స్ చెప్పే పాఠాలను విభిన్నంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని అన్వి తన మేనిఫెష్టోలో చేర్చటంతో ఇంప్రెస్ అయిన విద్యార్దులు అన్వికి విజయాన్ని చేకూర్చినట్లుగా తెలుస్తోంది.