Indian Physicists: అంతర్జాతీయ ఖగోళ సదస్సులో నలుగురు ఇండియన్లకు టాప్ అవార్డులు

దక్షిణకొరియాలోని 31వ ఇంటర్నేషనల్ అస్ట్రనామికల్ యూనియన్ (ఐఏయూ) మీట్‌లో నలుగురు ఇండియన్ రీసెర్చర్లకు టాప్ అవార్డులు దక్కాయి. ఏడుగురు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పాల్గొన్న కార్యక్రమంలో నలుగురికి వారి పీహెచ్‌డీ వర్క్‌కు గానూ అవార్డ్ అందించారు. ఈ నలుగురు రీసెర్చర్లు సోలార్ ఫిజిక్స్‌లో స్పెషలైజ్ పొందిన వారు.

Indian Physicists: అంతర్జాతీయ ఖగోళ సదస్సులో నలుగురు ఇండియన్లకు టాప్ అవార్డులు

 

 

Indian Physicists: దక్షిణకొరియాలోని 31వ ఇంటర్నేషనల్ అస్ట్రనామికల్ యూనియన్ (ఐఏయూ) మీట్‌లో నలుగురు ఇండియన్ రీసెర్చర్లకు టాప్ అవార్డులు దక్కాయి. ఏడుగురు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పాల్గొన్న కార్యక్రమంలో నలుగురికి వారి పీహెచ్‌డీ వర్క్‌కు గానూ అవార్డ్ అందించారు. ఈ నలుగురు రీసెర్చర్లు సోలార్ ఫిజిక్స్‌లో స్పెషలైజ్ పొందిన వారు.

కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియాకు చెందిన ప్రంతికా భౌమిక్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన గోపాల్ హజ్రా.. సౌవిక్ బోస్, గతంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌తో పాటు కుమౌన్ యూనివర్శిటీకి చెందిన రీతికా జోషి, నైనిటాల్‌లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్‌కు చెందిన రీతికా జోషి అత్యున్నత పురస్కారాలను పొందారు.

“ఒక దేశం గ్లోబల్ ఫోరమ్‌లో ఇన్ని పీహెచ్‌డీ థీసిస్ అవార్డులను గెలుచుకోవడం చాలా అరుదు. సోలార్ ఫిజిక్స్ రంగంలో బహుమతులు రావడం మరింత అరుదైన విషయం. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో చేస్తున్న సూర్యుడిని, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి చేసిన నాణ్యమైన పనికి రుజువు ఇది” అని ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ దీపాంకర్ బెనర్జీ అన్నారు.

Read Also : భూమి పుట్టుక గురించి కొత్త ఆధారాలు..అక్కడి నుంచే పుట్టిందంటున్న శాస్త్రవేత్తలు

పూణేలోని జెయింట్ మెట్రీవేవ్ రేడియో టెలిస్కోప్ , నైనిటాల్‌లోని దేవస్థాల్ ఆప్టికల్ టెలిస్కోప్, హన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ, ఉదయపూర్, కొడైకెనాల్‌లోని సోలార్ అబ్జర్వేటరీలతో సహా దేశీయంగా అభివృద్ధి చేసిన అన్ని ప్రధాన ఖగోళ సౌకర్యాలు, టెలిస్కోప్‌లను పెవిలియన్ ప్రదర్శించింది.

అంతేకాకుండా, ‘ చంద్రయాన్ ‘, ‘ఆస్ట్రోశాట్’ వంటి అంతరిక్ష ఆధారిత మిషన్లు, ‘ఆదిత్య L1’, ‘లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (LIGO) ఇండియా’, ‘ముప్పై మీటర్ల టెలిస్కోప్ (TMT) వంటి రాబోయే అంతరిక్ష-ఆస్ట్రో మిషన్‌లతో పాటు ‘స్క్వేర్ మీటర్ అర్రే (SKA)’ కూడా ప్రదర్శించారు.