వావ్ గ్రేట్ న్యూస్ : కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన ఇండియన్ సైంటిస్టు!

  • Published By: madhu ,Published On : February 7, 2020 / 11:03 AM IST
వావ్ గ్రేట్ న్యూస్ : కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన ఇండియన్ సైంటిస్టు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు మందు దొరకదా ? వందల మంది మృతి చెందుతుండడం..పొరుగు దేశాలకు ఈ వైరస్‌ పాకుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్‌కు విరుగుడుకట్టే పనిలో ఉన్నారు అక్కడి శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో ఇండియన్ సైంటిస్టు..నేతృత్వంలోని ఆస్ట్రేలియా బృందం జరుపుతున్న పరిశోధనల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఆస్ట్రేలియాలోని కామన్ వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CSIRO) హై సెక్యూర్టీ ల్యాబ్‌లో పరిశోధనలు జరుపుతోంది. దీనికి వ్యాక్సిన్ కనిపెడుతున్నట్లు వస్తున్న వార్తలపై భారతీయ సంతతి శాస్త్రవేత్త ఎన్ఎస్ వాసన్ మాట్లాడారు. రక్త నమూనాల నుంచి వైరస్‌ను వేరు చేయగలిగినట్లు, వ్యాక్సిన్‌‌ను వైరస్‌ సోకినవారిపై నేరుగా పరీక్షిస్తామన్నారు. 
ప్రస్తుతం వైరస్‌ను మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నామని, పూర్తిస్థాయిలో వైరస్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన పరిశోధన స్పీడప్ చేయడం జరుగుతుందన్నారు.

కానీ..CSIRO మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదనే విషయాన్ని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్‌కు పూర్తిస్థాయిలో చికిత్సకు అవసరమైన విధంగా తాము పరిశోధనలు చేయడం జరుగుతుందని వాసన్ తెలిపారు. 

వాసన్ ఎవరు ? 
CSIRO చేపట్టిన వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ఇవేల్యూషన్ ప్రాజెక్టులో ప్రోఫెసర్ వాసన్ పరిశోధకుడిగా ఉన్నారు. ఈయన బిట్స్ పిలానీ, బెంగళూరులోని IISC విద్యాభ్యాసం పూర్తి చేశారు. లండన్ ఆక్స్ పర్డ్‌లోని ట్రినిటీ కళాశాలలో పరిశోధనలు చేశారు. ఎన్నో వ్యాధులపై అధ్యయనం చేశారు. డెంగ్యూ, చికెన్ గున్యా, జికాలాంటి వైరస్‌లున్నాయి. 

* వ్యాక్సిన్ లేని ప్రాణాంతక కరోనా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్(34)ఇప్పుడు అదే వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు.
* వృ‌త్తి రీత్యా కంటి వైద్య నిపుణుడైన లీ వెన్లియాంగ్ కరోనా అనే వైరస్ పురుడు పోసుకుందనే విషయాన్ని మొదటగా గుర్తించాడు. 
* వూహాన్ సిటీలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

* చైనా వ్యాప్తంగా 28 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు.
* చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. 
* 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం నాటికి 638 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.