Queen Ketevan Murder Mystery : 400 ఏళ్ల క్రితం జార్జియా రాణి కేతేవాన్ హత్య..మిస్టరీని ఛేధించిన భారత పరిశోధకులు

400 సంవత్సరాల క్రితం జరిగిన జార్జియా రాణి హత్య మిస్టరీని భారత శాస్త్రవేత్తలు ఛేధించారు. జార్జియా రాణి కేతేవాన్ గొంతు కోసం హత్య చేయబడింది అని నిర్ధారించారు. ఎక్కడో పర్షియాలో జరిగిన జార్జియా రాణి హత్యను భారత్ లో లభించిన రాణి అవశేషాల అధారంగా భారత శాస్త్రవేత్తలు రాణి కేతేవాన్ హత్య మిస్టరీని ఛేధించారు.

Queen Ketevan Murder Mystery : 400 ఏళ్ల క్రితం జార్జియా రాణి కేతేవాన్ హత్య..మిస్టరీని ఛేధించిన భారత పరిశోధకులు

400 Year Old Murder Mystery (1)

400 Year Old Georgia Queen Ketevan Murder Mystery: ప్రపంచ వ్యాప్తంగా పురాతత్వ శాస్త్రవేత్తలు చరిత్రలో దాగి ఉన్న రహస్యాలను వెలికితీస్తుంటారు. గతంలో మిగిలిపోయిన జ్ఞాపకాలను బైటపెడతారు. అంతేకాదు వందల ఏళ్ల క్రితం జరిగిన అత్యంత హత్యకు సంబంధించిన మిష్టరీలను ఛేధిస్తారని మరోసారి నిరూపించారు. మన భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు అటువంటి ఘతన సాధించారు. భారత పరమాణు జీవశాస్త్రవేత్తలు ఎప్పుడో 400 ఏళ్ల నాడు హత్యకు గురైన రాణి హత్య మిస్టరీని చేధించారు. రాణి కేతేవాన్ ను అత్యంత దారుణంగా గొంతు కోసి చంపారని భారత పరిశోధకులు నిర్ధారించారు. ఎక్కడో జార్జియాకు చెందిన రాణి కేతేవాన్ ది సాధారణ మరణం కాదని ఆమె అత్యంత దారుణ హత్యకు గురైందని దృవీకరించారు భారత శాస్త్రవేత్తలు. రాణి కేతేవాన్ మృతదేహం అవశేషాల్లో ఒకదానిని మనదేశంలోనే గోవాలో పూడ్చారు. గోవాలోని సెయింట్ అగస్టీన్ కాన్వెంట్ లో తవ్వితీసిన ఆ అవశేషానికి డీఎన్ఏ పరీక్షలు చేస్తే అది రాణి కేతేవాన్ దేనని తేలింది.

రాణి కేతేవాన్ మరణం వెనుక అసలేం జరిగిందీ : 1613లో పర్షియా ( ఇరాన్) చక్రవర్తి షా అబ్బాస్ దండయాత్రలు చేపట్టి జార్జియాను జయించాడు. అలా జార్జియా రాణి కేతేవాన్ ను ఇరాన్ కు నైరుతిలో ఉన్న షిరాజ్ అనే నగరంలో 10 ఏళ్లపాటు బందీగా ఉంచాడు. ఆ క్రమంలో ఆమెను మతం మారాలని..తన అంతఃపురంలో చేరాలని పర్షియా చక్రవర్తి హుకుం జారీ చేసాడు. అయినా కేతేవాన్ ఏమాత్రం బెదరలేదు. చక్రవర్తి ఆదేశాలను పాటించలేదు సరికదా..ఆత్మాభిమానాన్ని చూపింది. దాంతో పర్షియా రాజు అహం దెబ్బతింది. ఆమెను చిత్రహింసలకు గురయ్యేలా చేశాడు. అవి ఎంత దారుణమైన హింసలో చెప్పటానికి వీలు కానివి. అయినా ఆమె మతం మార్చుకోవాటానికి అంగీకరించలేదు. ఆ తర్వాత కొంతకాలానికి రాణి కేతేవాన్ మరణించింది. ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు ఈ ఇద్దరు అగస్టీనియన్ పూజారులు ఒక మిషన్ ప్రారంభించడానికి షిరాజ్‌కు వచ్చారు. వారు రాణిని కలవడానికి పర్షియా చక్రవర్తి నుంచి అనుమతి పొందడమే కాక ఆమెకు సహాయకులుగా మారారు. ఈ క్రమంలో కేతేవాన్‌ సమాధిని వెలికితీసి..రాణి అవశేషాలను 1624 నుంచి 1627 వరకు దాచిపెట్టారు. ఆ తరువాత రాణి అవశేషాలను సురక్షితంగా ఉంచడానికి..ఆమె శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు ప్రదేశాలలో దాచారు. దీంట్లో భాగంగానే రాణి కేతవాన్ కుడిచేయిని భారత్ లోని గోవాలో పూడ్చిపెట్టారు.

గోవాలో రాణి కేతేవాన్‌ అవశేషాలు
ఈ క్రమంలో రాణి కేతేవాన్‌ కుడి చేయిని ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టీనియన్ కాన్వెంట్‌కు తీసుకువెళ్లి అక్కడ సురక్షితంగా పూడ్చి పెట్టినట్లు సాహిత్య ఆధారాలున్నాయి. అంతేకాక వారు రాణి అవశేషాలను ఎక్కడెక్కడ పూడ్చిన విషయాలను కొన్ని పత్రాలలో స్పష్టంగా పేర్కొన్నారు. దీనిలో ఓల్డ్‌ గోవా సెయింట్‌ అగస్టీనియస్‌ చర్చి ప్రస్తావన కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు చర్చిని పునర్నిర్మించడంతో ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు జార్జియా ప్రజలకు రాణి అవశేషాలు ముఖ్యమైనవి కాబట్టి, అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం, ఆ తరువాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత జార్జియన్ ప్రభుత్వం, రాణి శేషాలను గుర్తించడంలో సహాయపడాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

ఈ క్రమంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) గోవా విభాగం స్థానిక చరిత్రకారులతో కలిసి తీవ్రంగా శోధించింది. 2004లో సెయింట్ అగస్టీన్ కాన్వెంట్ నిర్మాణం మ్యాప్ పై ఓ అంచనాకు వచ్చారు. అలా అంచనా ఆధారంగా ఈ దశలో భారత పరిశోధకులు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిం తవ్వకాలు చేపట్టగా..ఓ పొడవైన చేతి ఎముకతో పాటు మరికొన్ని అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ శోధన 1980 ల చివరలో ప్రారంభమై.. అనేక విరమాలతో కొనసాగింది. చాలా ప్రయత్నాల తరువాత, స్థానిక చరిత్రకారులు, గోవా సర్కిల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) పురావస్తు శాస్త్రవేత్తలు 2004 లో సాహిత్య వనరుల ఆధారంగా చర్చి గ్రౌండ్ మ్యాప్‌ను పునర్నిర్మించారు. ఈ క్రమంలో మొదట అక్కడ పూడ్చి పెట్టిన ఓ పొడవైన చేయి ఎముకను.. ఆ తరువాత మరో రెండు అవశేషాలను గుర్తించగలిగారు.

తమకు లభ్యమైన అవశేషాల్లో ఒకదాన్నుంచి మైటోకాండ్రియల్ డీఎన్ఏ ను వేరు చేసి, దాన్ని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ) డేటా బ్యాంకులోని వేలాది డీఎన్ఏ సీక్వెన్స్ లతో పోల్చి చూశారు. అయితే అవి సరిపోలవకపోవడంతో, చేతి ఎముక నమూనాలను డేటా బ్యాంకు నమూనాలతో కంపార్ చేసి చూడగా..అది రాణి కేతేవాన్ డీఎన్ఏతో సరిపోయింది.

22 వేల డీఎన్‌ఏలతో పోల్చగా ఆఖరికి ఫలించిన యత్నం
గుర్తించిన అవశేషాల్లో క్వీన్ కేతేవన్‌కి సంబంధించిన వాటిని గుర్తించడం కోసం మూడు అవశేషాల మైటోకాన్డ్రియల్ డీఎన్‌ఏను వేరుచేశారు. దాన్ని సీసీఎంబీ డేటా బ్యాంక్‌లో 22,000 కంటే ఎక్కువ డీఎన్‌ఏ సీక్వెన్స్‌లతో సరిపోల్చారు. మొదట గుర్తించిన అవశేషం దేనితో సరిపోలేదు.ఈ క్రమంలో సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేశారు. తరువాత గుర్తించిన రెండు అవశేషాలు దక్షిణ ఆసియాలోని వివిధ జాతులతో ముఖ్యంగా భారతదేశంతో సరిపోలాయి. దాంతో మొదట తాము గుర్తించిన చేయిని రాణి కేతేవాన్‌ది ప్రకటించారు శాస్త్రవేత్తలు. అలా రాణి కేతేవాన్ ను 4 శతాబ్దాల కిందట గొంతుకోసి చంపారని భారత పరిశోధకులు గుర్తించారు. ఆ తరువాత ఏడు సంవత్సరాల సుదీర్ఘ దౌత్యప్రక్రియల తరువాత జులై 9, 2021న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ రాణి కేతేవాన్ అవశేషాలను, పరిశోధన సమాచారాన్ని జార్జియా ప్రభుత్వానికి అందజేశారు.

కానీ పర్షియా చక్రవర్తి షా అబ్బాస్ జార్జియా రాణి సెయింట్ క్వీన్ కేతేవన్‌ను హత్య చేసిన ఘటన గురించి ఇరానియన్ కథనాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇరానీయులు తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్య పాలకుల్లో షా అబ్బాస్ ను ఒకడిగా భావిస్తారు. అతన్ని ఓ హీరోలా భావిస్తారు. దాంతో రాణి కేతేవాన్ ను తమ చక్రవర్తి చంపలేదనే అంటారు. కానీ జార్జియా రాణి కేతేవాన్ మృతి గురించి భిన్న వైరుధ్యాలు ఉన్న..ఈ మిస్టరీని మన శాస్త్రవేత్తలు పరిష్కరించారు.