న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక : మళ్లీ టీమ్‌లోకి రోహిత్ శర్మ

శ్రీలంకతో సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 క్రికెట్‌ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది.

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 01:57 AM IST
న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక : మళ్లీ టీమ్‌లోకి రోహిత్ శర్మ

శ్రీలంకతో సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 క్రికెట్‌ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది.

న్యూజిలాండ్‌తో జరిగే టీ20 క్రికెట్‌ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి కివీస్‌లో టీ 20ల సిరీస్ ప్రారంభం కానుంది. శ్రీలంకతో సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. విరాట్‌ కోహ్లిని కెప్టెన్‌గా కొనసాగించగా, జట్టులోకి రోహిత్‌ శర్మ తిరిగివచ్చాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు షమీకి స్థానం లభించగా కేరళ క్రికెటర్‌ సంజు శాంమ్సన్‌కు ప్లేస్ దొరకలేదు. 

న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టీ20లు ఆడుతుంది. తొలి మ్యాచ్‌ ఈ నెల 24 అక్లాండ్‌లో జరుగుతుంది. సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో మూడు వన్డేలు ఆడాక భారత్‌ ఈ నెలలోనే న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లు ఆడనుంది. మొదట 5 టి20లు, ఆ వెంటే 3 వన్డేల సిరీస్‌ ఆడాక… మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. అనంతరం రెండు టెస్టుల్లో తలపడుతుంది. 

సుదీర్ఘ కాలం బెంచ్‌పై నిరీక్షించిన అనంతరం లంకతో చివరి టీ20లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న శాంసన్‌.. ఒక్క సిక్సర్‌ కొట్టి ఔటైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌ టూర్‌లో జరిగే మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం జట్టును ఆదివారమే ప్రకటించాల్సి ఉన్నా.. సెలెక్షన్‌ కమిటీ తాత్కాలికంగా వాయిదా వేసింది. హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌పై నెలకొన్న సందిగ్ధతే ఇందుకు కారణమని తెలుస్తోంది.

టీ20 జట్టు : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ‌, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌, శివం దూబే, కుల్దీప్ యాదవ్‌‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌.

శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ లో భారత్ సిరీస్ కొట్టేసింది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయకేతనం ఎగరేసింది. పర్యాటక జట్టుపై రెండో మ్యాచ్ లోనూ భారీ విజయం సాధించి కప్పు దక్కించుకుంది.