India Covid Crisis : భారత్‌లో కరోనా సంక్షోభం : కొన్ని వారాలు దేశాన్ని షట్ డౌన్ చేయండి.. ఎక్కడివారు అక్కడే ఉండండి.. అంతా నార్మల్‌కు వచ్చేస్తాం!

భారతను కరోనా సంక్షోభం వెంటాడుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పై విదేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి.

India Covid Crisis : భారత్‌లో కరోనా సంక్షోభం : కొన్ని వారాలు దేశాన్ని షట్ డౌన్ చేయండి.. ఎక్కడివారు అక్కడే ఉండండి.. అంతా నార్మల్‌కు వచ్చేస్తాం!

Shut Down The Country For A Few Weeks, Hang In There We’ll Get To A Normal (2)

India’s Covid Crisis Shut down the country for a few weeks : భారతను కరోనా సంక్షోభం వెంటాడుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పై విదేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించగా.. ఆమెరికా కూడా భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో భారత్ లో కోవిడ్ సంక్షోభంపై డాక్టర్ ఆంథోనీ ఎస్ ఫౌసీ మాట్లాడుతూ.. కొన్ని వారాలు దేశాన్ని షట్ డౌన్ చేసేయండి.. ఎక్కడివారు అక్కడే ఉండిపోండి.. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి.. అప్పుడు మనమంతా సాధారణ స్థితికి చేరుకుంటాము’ అని పిలుపునిచ్చారు.

ఏ దేశమూ కూడా తనను తాను లాక్ చేయటానికి ఇష్టపడదన్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్ని వారాల పాటు లాక్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేయకలిగినప్పుడే భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అంతం చేయగలదన్నారు. భారతదేశంలో పరిస్థితిపై తానెలాంటి విమర్శలు చేయనని చెప్పారు. అలా చేస్తే అది రాజకీయ సమస్య అవుతుంది.. తాను ప్రజారోగ్య వ్యక్తిని రాజకీయ వ్యక్తిని కానని స్పష్టం చేశారు. ప్రస్తుతం, భారతదేశం విపత్కర పరిస్థితిలో ఉందని అనిపిస్తోందన్నారు. ఆక్సిజన్ సంక్షోభాన్ని ఇండియా ఎదుర్కొంటోంది. ఈ సమస్య నుంచి తక్షణమే గట్టుఎక్కేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ప్రపంచ దేశాలు సైతం భారత్ కు సాయంగా ముందుకు రావాల్సిన సమయమన్నారు. దేశ ప్రజలందరికి టీకాను అందించాలి.. ఆక్సిజన్ అవసరాలను తీర్చాలి. కరోనా సంక్షోభ సమయాల్లో ప్రజలందరికి సరైన చికిత్స అందించాలి. గతంలో సంక్షోభ సమయాల్లో భారత్ ఎంతో సాయం చేసిందని, ఇప్పుడు ఆ దేశానికి సాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశ ప్రజలందరికి సాయం అందించేందుకు మిలటరీ సాయం కోరవచ్చునని తెలిపారు. అమెరికాలో టీకాలను పంపిణీ చేయడంలో తమ నేషనల్ గార్డ్స్ చేసిన సాయం మాదిరిగా భారత్ లోనూ సైనిక సాయం పొందవచ్చునని సూచించారు.

తాత్కాలిక ఆస్పత్రులను త్వరగా నిర్మించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. యుద్ధ సమయంలో నిర్మించిన క్షేత్ర ఆసుపత్రుల మాదిరిగా ఉండాలి. మీరు కొన్ని విషయాల్లో యుద్ధం లాగా ఆలోచించాలి. ఇక్కడ శత్రువు వైరస్. కాబట్టి శత్రువు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసునని అన్నారు. రెండు వారాల వ్యవధిలో ఎక్కువ మందికి టీకాలు వేయాలి. ఖచ్చితంగా ఎక్కువ మందికి టీకాలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. త్వరలోనే మహమ్మారి అంతమైపోతుంది. అంతా సాధారణ స్థితికి వస్తుంది. ఎక్కడివారు అక్కడే ఉండండి.. ఒకరినొకరు సాయం చేసుకోండి.. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి.. అన్ని సర్దుకుంటాయని ఫౌసీ సూచించారు.