Covid Vaccine : భారత్ కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతిపై నిషేధం.. సౌమ్యా స్వామినాథన్ తీవ్ర విమర్శలు

కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతులపై నిషేధం విధించడంపై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభావం 91 దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు సౌమ్య స్వామినాథన్. వ్యాక్సిన్ల కొరతతో ప్రజల కరోనాతో బాదపడుతున్నారని ఈ ప్రభావంతో కరోనా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Covid Vaccine : భారత్ కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతిపై నిషేధం.. సౌమ్యా స్వామినాథన్ తీవ్ర విమర్శలు

Indias Covid Vaccine Export Ban (1)

India’s covid vaccine export ban : కరోనాను ఖతంచేసే వ్యాక్సిన్ ఎగుమతి చేసే విషయంలో భారత్ అవలంభించే తీరు పలు దేశాలను ప్రభావితంచేస్తోందని..వ్యాక్సిన్ల ఎగుమతులపై ఇండియా నిషేధం విధించడంతో 91 దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభావం ముఖ్యంగా పేద దేశాలైన ఆఫ్రికన్ దేశాలపై పడిందని..అక్కడ 0.5 శాతం మందికే వ్యాక్సినేషన్ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు సౌమ్య స్వామినాథన్. వ్యాక్సిన్ల కొరతతో ప్రజల కరోనాతో బాదపడుతున్నారని ఈ ప్రభావంతో కరోనా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారామె.

భారత ప్రభుత్వం వ్యాక్సిన్ల ఎగుమతులపై నిషేధం విధించడంతో 91 దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారామె.ఆస్ట్రాజెనెకా మాతృ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి కాకపోవడంతో 91 దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని..ఈ ప్రభావం ఆఫ్రికన్ దేశాలపై పడిందని అన్నారు. భారత్ వైఖరి వల్ల ఆఫ్రికాలోను పలు దేశాల్లో 0.5 శాతం మందికే వ్యాక్సినేషన్ అయిందని అన్నారు. భారత్ వ్యాక్సిన్ల ఎగుమతి నిషేధంపై తీసుకున్న నిర్ణయంతో కనీసం ఆఫ్రికా దేశాల్లోని ఆరోగ్య సిబ్బందికి కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే దేశాలపై కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని..మరింతగా కోవిడ్ వ్యాపించే అవకాశాలున్నాయని సౌమ్యా స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్య సమితి కొవాక్స్ కార్యక్రమానికి 100 కోట్ల డోసులు సరఫరా చేస్తామని గతంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా హామీ ఇచ్చింది. కానీ..భారత్‌లో సెకండ్ వేవ్ తో కొవిడ్ వ్యాప్తి భారీగా పెరగటంతో టీకాల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో వ్యాక్సిన్ల సరఫరాపై కేంద్రం నిషేధం విధించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్..పేద దేశాలకు..దిగువ స్థాయి..మధ్యస్థంగా ఆదాయాలు ఉండే భారత్ తీసుకున్న వ్యాక్సిన్ల ఎగుమతి నిషేధ నిర్ణయం పలు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని..ఈ ప్రభావంతో కోవిడ్ మరింతగా వ్యాపించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గా..భారత్ లో ఉన్న ప్రజలకు వ్యాక్సిన్లు వేయకుండా విదేశాలకు అమ్ముకుంటున్నారనే విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.