‘సుడిగాలితో గర్భం దాల్చి..గంటలోనే బిడ్డకు జన్మనిచ్చిందట‘..!! చూడటానికి ఎగబడుతున్న జనాలు..!!

‘సుడిగాలితో గర్భం దాల్చి..గంటలోనే బిడ్డకు జన్మనిచ్చిందట‘..!! చూడటానికి ఎగబడుతున్న జనాలు..!!

Indonesia Bizarre..woman wind made her pregnant : వాయు (గాలి)దేవుడిని ప్రార్థించి కుంతీదేవి భీమసేనుడిని కన్నదని పురాణాల్లో చదువుకున్నాం. కానీ గాలి ద్వారా ఓ గర్భవతినయ్యానని ఓ గంటలోనే బిడ్డకు జన్మనిచ్చానని చెబుతోంది ఓ మహిళ. ఇది విన్నవారంతా షాక్ అవుతున్నారు. ఆమె చెప్పేది పచ్చి అబద్ధం ఇదేమన్నా పురాణాల కాలమా? అంటున్నారు. కానీ ఆమె మాత్రం నేను ‘సుడిగాలి ద్వారా గర్భవతిని అయ్యానని బిడ్డకు జన్మనిచ్చానని..పైగా కేవలం ఓ గంట సమయంలోనే బిడ్డ పుట్టిందని చెబుతుండటంతో ఈ వార్త కాస్తా హాట్..హాట్ టాపిక్ గా మారింది…!!

ఇండోనేసియాలో సితి జైనాహ్ అనే 25ఏళ్ల యువతి తను ‘సుడిగాలితో’ గర్భవతిని అయ్యానని చెబుతోంది. పైగా గంటలోగా పండంటి ఆడపిల్లకు జన్మ నిచ్చానని అంటోంది. ఇది విన్నవారంతాషాక్ అవుతున్నారు..!

దక్షిణ ఇండోనేసియా ప్రావిన్స్ జావా లోని సియాంజుర్ అనే టౌన్ లో సితి జైనాహ్ అన్న మహిళ ఈ షాకింగ్ న్యూస్ చెప్పింది. బుధవారం తమ ఇంటిలోని లివింగ్ రూమ్ లో తాను ప్రార్థన చేసుకుంటుంటండగా ఒక్కసారిగా సుడిగాలి చుట్టుముట్టిందని..ఆ గాలి తన యోని ద్వారా తన గర్భంలోకి వెళ్లినట్లుగా తనకు అనిపించిందని తరువాత 15 నిముషాల్లోనే తను గర్భం ధరించానని అది తెలిసిన తాను కూడా ఎంతో ఆశ్చర్యపోయానని స్థానికి మీడియాకు తెలిపింది.

ఆ తరువాత గంట సమయంలోనే తనకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందనీ..అవి అచ్చం ప్రసవం నొప్పుల్లా వచ్చాయని..వెంటనే కమ్యూనిటీ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ఆడపిల్ల పుట్టిందని తెలిపింది. కాగా ఆమెకు గాలి ద్వారా బిడ్డ పుట్టిందని చెబుతున్న ఆ శిశువు 2.9 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిడ్డకు జన్మనిచ్చిన సితి జైనాహ్ ను.. ఆమెకు పుట్టిన బిడ్డను చూసేందుకు అధికారులతో పాటు జనాలు క్యూ కట్టారు.

అయితే ‘సుడిగాలి’ అంటూ ఈమె చెబుతున్నదంతా కట్టుకథ అని, కొంతమంది మహిళలకు క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వస్తుందని..అంటే తాము గర్భం దాల్చినట్టు వారికి తెలియనే తెలియదని ఈ హాస్పిటల్ డైరెక్టర్ ఏమాన్ సులేమాన్ అంటున్నారు. ఈ వార్త వైరల్ కావటంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ఆరా తీసేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కాగా..సితి జైనాహ్ నాలుగు నెలల క్రితం తన భర్త నుంచి విడిపోయిందని..అప్పటికే వీరికి ఓ బిడ్డ ఉన్నాడని పోలీసులు తెలిపారు.