Indonesia Volcano: బద్దలైన అగ్నిపర్వతం.. 13మంది మృతి

ఇండోనేషియాలోని అతిపెద్ద దీవి జువాలో గల సుమేరు అగ్నపర్వతం బద్దలైంది.

Indonesia Volcano: బద్దలైన అగ్నిపర్వతం.. 13మంది మృతి

Indonesia Volcano

Indonesia Volcano: ఇండోనేషియాలోని అతిపెద్ద దీవి జువాలో గల సుమేరు అగ్నపర్వతం బద్దలైంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 13మందికి చేరుకుంది. అగ్నిపర్వతం సమీపంలోని పలు గనుల్లో పనిచేస్తోన్న కార్మికులు లోపలే చిక్కుకుపోగా మృతులు సంఖ్య పెరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో బూడిద బయటకు ఎగజిమ్మింది. దీంతో ఆ ప్రాంతం అంతా బూడిద కమ్మేసింది.

అగ్నిపర్వతం నుంచి వచ్చిన బూడిద ఆకాశాన్ని కప్పేసింది. వాల్ కనో బద్దలు కావడంతో స్థానికులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. కొన్ని నెలల వ్యవధిలో అగ్నిపర్వతం బద్దలవ్వడం ఇది రెండోసారి కాగా.. సెమేరు పర్వతం నుంచి దట్టమైన బూడిద వర్షం కురుస్తోంది.

Warangal : ఆరోగ్య ప్రధాయినిగా ఓరుగల్లు.. 2 వేల పడకలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

అగ్నిపర్వతం బద్దలు కావడంతో 15వేల మీ(50వేల అడుగులు) వరకు బూడిద మేఘావృతం అయ్యింది. విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర మట్టానికి 3,676 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వతం గతంలో జనవరిలో బద్దలైంది. ఇండోనేషియాలో 130 క్రియాశీల అగ్నిపర్వతాలలో మౌంట్ సుమేరు ఒకటి. అగ్నిపర్వతంకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది.

Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం.. డిసెంబర్‌ అంటే వణికిపోతున్న ప్రజలు