అతి త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఈ ఫీచర్ మాయం

అతి త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఈ ఫీచర్ మాయం

Instagram: ఇన్‌‌స్టాగ్రామ్ నుంచి అతి త్వరలోనే ఓ ఫీచర్ మిస్ కానుంది. కాకపోతే అది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. పాపులర్ ఫీచర్ అయినటువంటి స్టోరీస్ ఫీచర్ లో కొన్ని మార్పులు చేయనున్నారు. కొందరు యూజర్లు తమ పోస్టులను నేరుగా స్టోరీస్ లో యాడ్ చేస్తుంటారు. అలా జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

కొన్ని దేశాల్లో టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ రెడీ అయ్యాక నోటిఫికేషన్ రూపంలో అందరికీ తెలియజేస్తామని కంపెనీ అనౌన్స్ చేసింది. ‘టెస్టింగ్ దశలో కొందరి నుంచి ఇలాంటి రెస్పాన్స్ విన్నాం. తాము చేసిన పోస్టులు స్టోరీస్ లో కనిపించాలని కోరుకుంటున్నారు. అలా ఎప్పటికీ కుదరదు’ అని అందులో పేర్కొంది.

పోస్టులను స్టోరీలుగా కామన్ గానే షేర్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఒక్కోసారి మీ ఫ్రెండ్స్ స్టోరీస్ లో కూడా మీ ఫీడ్ డూప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. రీ షేరింగ్ ను ఎంకరేజ్ చేసి.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు తొలిస్థానానికి వెళ్లిపోయాయి. ఇప్పటికీ ఈ ఫీచర్ తీసేయడమనేది టెస్టింగ్ దశలోనే ఉంది.

మరికొద్ది రోజుల్లో కంపెనీ ఆదేశాల ప్రకారం.. ఫీచర్ తొలగించేస్తారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ లో తమ పోస్టులు స్టిక్కర్ రూపంలో షేర్ చేసుకునేందుకు ట్విట్టర్ కూడా శ్రమిస్తోంది.