శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి ముప్పు!

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 12:01 PM IST
శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి ముప్పు!

కొలంబోలో అట్టుడుకుతోంది. ఈస్టర్ వేడుకల్లో భాగంగా చర్చీల్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. 3 చర్చీలు, 3 హోటళ్లలో ఉగ్రవాదులు బాంబు దాడులకు తెగబడ్డారు. దీనితో ఆయా ప్రాంతాల్లో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. సహాయక చర్యలు కంటిన్యూ అవుతుండగానే మరో రెండు ప్రదేశాల్లో బాంబులు పేల్చారు ఉగ్రవాదులు. దీంతో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందోనని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. శ్రీలంక ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. 

తాజాగా శ్రీలంకలో ఉన్న రాయబార కార్యాలాయాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని ఇంటెలిజెన్స్ హెచ్చిరకలు జారీ చేసింది. ప్రధానంగా భారత రాయబార కార్యాలయానికి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ సూచించింది. నేషల్ తౌహీద్ – జమాత్ సంస్థ దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందని తెలిపింది. దీనితో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఎవరినీ అనుమతించడం లేదు. కేవలం ID ప్రూఫ్స్ ఉన్న వారిని..క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 

కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో 191 మృతి చెందినట్లు..500 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలుతో ఆస్పత్రులు మారుమోగుతున్నాయి. మృతి చెందిన వారిని ఇంకా గుర్తించలేదు. ఆస్పత్రుల్లో రక్తం కొరత ఏర్పడుతోందని..దాతలు ముందుకు రావాలని యాజమాన్యాలు, వైద్యులు పిలుపునిస్తున్నారు.