పోలీసులకు కుక్క కంప్లైంట్!: నేను తప్పిపోయాను మా యజమాని దగ్గరకు చేర్చరా..!!

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 08:48 AM IST
పోలీసులకు కుక్క కంప్లైంట్!: నేను తప్పిపోయాను మా యజమాని దగ్గరకు చేర్చరా..!!

ఓ కుక్క పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. నేను తప్పిపోయాను నన్ను నా యజమాని దగ్గరకు చేర్చరా అంటూ పోలీసులకు వేడుకుంది. అదేంటీ కుక్కేంటీ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయటమేంటి?అదేమన్నా మాట్లాడుతుందా? చోద్యం కాకపోతే అనుకుంటున్నారు. కదూ.. నిజమే ఆ కుక్క మాట్లాడలేదు. కానీ నేను తప్పిపోయాను నా యజమాని దగ్గరకు చేర్చండి అంటూ కుక్కు తెలియజేసిన విధానానికి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.ఇదో అద్భుతం అన్నారు. ఈ ఘటన ఫిబ్రవరి 11న టెక్సాస్‌లోని ఒడెస్సా పోలీస్ స్టేషన్‌లో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. అమెరికాలో టెక్సస్‌ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్ అర్థరాత్రి సమయంలో ఓ జర్మన్ షెపర్డ్ కుక్క వచ్చింది. రయ్ మంటూ స్టేషన్ లోకి దూసుకొచ్చిన కుక్కను చూసిన పోలీసులు ఏంటా అనుకున్నారు.తరువాత అది పోలీసుల వైపు చూస్తూ ఏవేవో సైగలు చేసింది. అలా చాలాసేపు చేసింది. ఆ సైగలకు అర్థం ఏమిటో మొదట వారికి ఏమాత్రం అర్థం కాలేదు. ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఆ సైగలను అర్థం చేసుకోవటానికి యత్నించారు. చిట్టచివరకు ఆ సైగలను అర్థం చేసుకున్న టెక్సాస్ పోలీసులు ఆశ్చర్యపోయారు. కుక్కలు చాలా తెలివిగలవి..అందులోని జర్మన్ షెపర్డ్ జాతి కుక్కలకు ఆ తెలివి కాస్త ఎక్కువే..దానికి ఈ కుక్క చేసిన సైగలే ఉదాహరణ అనుకున్నారు.

See Also>>జీతం సరిపోలేదేమో : సైన్ కోసం లక్షలు డిమాండ్ చేసిన మహిళాధికారి

కుక్క..తాను తప్పిపోయాననీ.. తనకు దారి తెలియడం లేదని, యజమానికి తనను అప్పగించమని పోలీసులను వేడుకుంది. ఈ సారాంశాన్ని తన సైగలతో పోలీసులకు ఇదంతా అర్థమయ్యేలా చెప్పింది.  అది అర్థం చేసుకున్న పోలీసులు కుక్క ప్రవర్తనకు ఫిదా అయిపోయారు. 

రాత్రంతా దానిని తమ దగ్గరే ఉంచుకున్నారు. చక్కగా దానితో సంతోషంగా ఆడుకున్నారు. కుక్క కూడా పోలీసులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్లతో కలిసిపోయి చక్కగా ఆడుకుంది. కుక్క తెలివికి ఫిదా అయిన పోలీసులు.. దానిని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అవికాస్తా వైరల్ గా మారాయి. 

’గత రాత్రి యాదృచ్చికంగా మా స్టేషన్‌లోకి వచ్చిన ఈ తెలివిగల కుక్క.. రాత్రంతా మాతో సరదాగా గడిపింది. మాపై ఎంతో ప్రేమను చూపించింది. అది సురక్షితంగా యాజమాని దగ్గరకు చేరినందుకు సంతోషంగా ఉంది’ అని పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

కుక్క మెడలో ఎటువంటి గుర్తింపు ట్యాగ్‌ లేకపోవడంతో దాని యజమానిని గుర్తించడం పోలీసులకు కాస్త కష్టమైంది. దీంతో పోలీసులు సోషల్ మీడియాలో కుక్క ఫోటోలు పోస్ట్ చేయటం..అవి వైరల్ గా మారటంతో అవి ఆ కుక్క యజమాని దృష్టికి వెళ్లాయి. అలా యజమాని పోలీసులను సంప్రదించి కుక్కును తీసుకెళ్లారు. 

రాత్రి పడుకుని నిద్రపోయే సమయంలో కుక్క బయటకు వెళ్లిపోయిదనీ..దారి తప్పిపోవడంతో.. అది మైళ్ల దూరంలో ఉన్న పోలీసులు స్టేషన్‌కు వెళ్లిందని యజమాని తెలిపారు. తప్పిపోయానంటూ రక్షణ కోసం తన పెంపుడు కుక్క ‘చికో’ పోలీసులను ఆశ్రయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏదేమైనా నా బంగారు  కుక్క తెలివికి సంతోషంగా ఉందని అన్నారు.  

Read More>>ప్రయాణీకుడి బట్టలు విప్పేసి..ప్లాస్టిక్ కవర్‌తో ప్యాక్ చేసి విమానంలో పడేసిన అధికారులు