కులాంతర వివాహాలు భావి తరాలకు మేలు..ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెరుగుతుంది..

  • Published By: nagamani ,Published On : November 25, 2020 / 10:58 AM IST
కులాంతర వివాహాలు భావి తరాలకు మేలు..ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెరుగుతుంది..

inter caste marriages Health for future generations science study : కులాంతర పెళ్లిళ్లు ఆరోగ్యానికి, భావితరాలకు మేలు చేస్తాయని వైద్య పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయంపై ఏనాటి నుంచి పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. హార్వర్డ్ వర్సిటీ సైంటిస్ట్ డేవిడ్ రీచ్ రాసిన పుస్తకంలో దీనికి సంబంధించిన చాలా వివరాలు క్షుణ్ణంగా ఉన్నాయి.



Who We Are and How We Got Here అనే పుస్తకంలో భారతీయుల జన్యువులు, డీఎన్ఏ వంటి పలు కీలక అంశాలకు సంబంధించి విశ్లేషణను ఆయన ఆ బుక్ లో పొందుపరిచారు. ఈ పుస్తకంలోని వివరాల ప్రకారం.. ఒకే కులానికి చెందినవారు పెళ్లి చేసుకుంటే తరాలు గడిచేకొద్దీ పుట్టే పిల్లల్లో జన్యులోపాలు ఏర్పడతాయని తెలిపారు. కులం లోపల పెళ్లిళ్లు శతాబ్దాల తరబడి జరుగుతుంటే అవి భవిష్యత్ తరాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. పిల్లలు జన్యువైవిధ్యం లేక వ్యాధులు వచ్చే అవకాశముంటుంది.



భారతీయుల్లో అత్యధిక శాతం మంది ప్రాచీన ఉత్తర భారతీయ(ఏఎన్ఐ), ప్రాచీన దక్షిణ భారతీయ(ఏఎస్ఐ) వర్గాలకు చెందిన వారు. అగ్రవర్ణాలు, ఉత్తర భారతీయుల ఎక్కువగా ఏఎన్ఐ విభాగంలో ఉన్నారు. 4 వేల ఏళ్ల కిందట ఏఎన్ఐ, ఏఎస్ఐల మధ్య పెళ్లిళ్లు జరిగేవి కావు. తర్వాత కాలంలో వాటి మధ్య వివాహ సంబంధాలున్నాయి.
https://10tv.in/indian-bride-who-wore-a-pantsuit-to-her-wedding/


అయితే 2 వేల ఏళ్ల నుంచి అంటే.. 70 తరాల కిందట ఈ పెళ్లిళ్లు నిలిచిపోయాయి. దీనికి కారణం కులాల అవతరణ..వాటి మధ్య వచ్చిన విభేధాలే కారణంగా తెలుస్తోంది. ఆ ప్రభావం దళితుల జన్యువులు భిన్నంగా మారాయి. ఒకే కులంలోపల పెళ్లిళ్లు అలాగే సమీప బంధువులతో (మేనరికాలు వంటివి) పెళ్లిళ్ల వల్ల జన్యవైవిధ్య కొరవడి కొన్ని సమూహాల్లో నాడీసంబంధ జన్యుసంబంధ వ్యాధులు మొదలయ్యాయి.



ఇది భారతదేశంలోనే కాకుండా కులాలల్లోనే పెళ్లిళ్లు పాటించే అస్కెనాజి యూదుల్లోనూ కనిపిస్తోంది. భారత దేశంలో కులపెళ్లిళ్ల సమూహాలు చాలా ఉండడంతో వ్యాధులు కూడా ఎక్కువయ్యే అవకాశముంది. మన దేశంలో జరిగే పెళ్లిళ్లలో కులాంతర పెళ్లిళ్లు కేవలం 5 నుంచి 6 శాతం మాత్రమే జరుగుతున్నాయి. వీటిని పెంచడం వల్ల అటు కులవివక్షను అరికట్టడమే కాకుండా ఇటు ఆరోగ్యం కూడా చేకూర్చినట్లు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.



భారత్ లౌకిక వాద దేశమని మన రాజ్యాంగం చెబుతోంది. ప్రపంచదేశాలు భారతదేశపు సంస్కృతి, ప్రజాస్వామ్య వ్యవస్థ ను గౌరవిస్తాయి. కానీ దాన్ని మనం ఎంత వరకూ నిలబెట్టుకుంటున్నాం అనేది పెద్ద ప్రశ్నగా మారింది కులం పేరుతో జరుగుతున్న దాడులు..హత్యలు, దారుణ హింసలు చూస్తుంటే. భారత్ లో ఎన్నో కులాలు..మతాలు, తెగలు ఉన్నాయి.



వారి వారి ఆచార వ్యవహారాలు..సంస్మృతీ సంప్రదాలు చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే వారి ఆహార వ్యవహారాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం సమాజంలో ఆహారం తినే విషయంలో కూడా ఆంక్షలు పెరుగుతున్నాయి. ఇటువంటి ఆహారం తినకూడదనే ఆంక్షలు దానికి సంబంధించి దాడులు జరుగుతున్న సందర్భాలను చూస్తున్నాం.



ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..అతి లో ప్రధాన సమస్యలు పేదరికం, కులవివక్ష. కుల వివక్షలను నిర్మూలించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. కానీ అది ఎంత వరకూ జరుగుతోందని పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతోంది.ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఎంతో డెవలప్ అయ్యామని చెప్పుకుంటున్న తరుణంలో కులవివక్షను మాత్రం విడిచిపెట్టటం లేదు.



కేవలం సాంకేతికంగా మాత్రమే మనిషి ఎదుగుతున్నాడు తప్ప మనుషులంతా సమానం..కులాలు..మతాలు మనం సృష్టించుకున్నవే అనే సంగతి మాత్రం గుర్తించలేకపోతున్నాం. ఈ కుల వివక్షల కాటుకు ఎంతో మంది బలవుతున్నాయి. కులాంతర వివాహాలను మన కరడుగట్టిన కుల సమాజం జీర్ణించుకోవడం లేదు. ఈ పెళ్లిళ్లతో పరువు పోతుందని పెద్దలు దారుణాలకు ఒడిగడుతున్న సందర్భాలను ఎన్నో చూశాం..చూస్తున్నాం కూడా.



ఇటువంటి ఆలోచనలు పెరుగుతుంటే ఇక భవిష్యత్ తరాలకు ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వగలం? అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఈ ఆలోచనలు మారి భవిష్యత్ తరాలకు ఆరోగ్యాలను ఇచ్చే దిశగా సమాజం ఆలోచనా విధానం మారాలని ఆశిద్దాం..కులాంత వివాహం చేసుకుంటే
పరువు పోతుందనే ఆలోచనలకు స్వస్తి చెబుదాం..