Rings Around Jupiter Planet : గురుగ్రహానికి సంబంధించి ఆసక్తికర దృశ్యాలు..బృహస్పతి చుట్టూ వలయాలు గుర్తింపు

జేమ్స్ వెబ్ టెలిస్కోపు... గురు గ్రహానికి సంబంధించిన ఆసక్తికర దృశ్యాలను లోకానికి అందించింది. అత్యంత శక్తిమంతమైన ఈ స్పేస్ క్రాఫ్ట్... గురు గ్రహాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించింది. బృహస్పతి చుట్టూ వలయాలు ఉన్న సంగతిని జేమ్స్ వెబ్ టెలిస్కోపు మొదటిసారిగా గుర్తించింది.

Rings Around Jupiter Planet : గురుగ్రహానికి సంబంధించి ఆసక్తికర దృశ్యాలు..బృహస్పతి చుట్టూ వలయాలు గుర్తింపు

Rings Around Jupiter Planet

Rings Around Jupiter Planet : జేమ్స్ వెబ్ టెలిస్కోపు… గురు గ్రహానికి సంబంధించిన ఆసక్తికర దృశ్యాలను లోకానికి అందించింది. అత్యంత శక్తిమంతమైన ఈ స్పేస్ క్రాఫ్ట్… గురు గ్రహాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించింది. బృహస్పతి చుట్టూ వలయాలు ఉన్న సంగతిని జేమ్స్ వెబ్ టెలిస్కోపు మొదటిసారిగా గుర్తించింది.

100 Planets Jupiter : బృహస్పతి కన్నా 100కుపైగా అతిపెద్ద గ్రహాలు ఇవిగో.. పెద్ద స్టార్ లేకుండానే తిరుగుతున్నాయట..!

ఈ సారి గురుగ్రహంపై తన దృష్టి సారించిన ఈ సంచార అబ్జర్వేటరీ… భారీ తుపానులు, ప్రచండ గాలులు, ఆరోరాలు, అత్యంత అధిక ఉష్ణోగ్రతలు, పీడనం లాంటి అంశాల డేటాను సేకరించి భూమికి చేరవేసింది. అంతేకాదు… గురు గ్రహం ఉపరితలంపై కనిపించే పెద్ద ఎర్రని చుక్కను కూడా పరిశోధించింది.