International Coffee Day: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం వెనక విశేషాలు

అక్టోబర్ 1. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. ఈరోజు ఎలా మొదలైంది?ఈరోజు వెనుక ఉన్న విశేషాలేంటో తెలుసుకుందాం..

International Coffee Day: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం వెనక విశేషాలు

International Coffee Day 2021 (1)

International Coffee Day 2021: అక్టోబర్ 1. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రత్యేక రోజుల వెనుక ఎన్నో అర్ధాలుంటాయి.మరెన్నో విశేషాలుంటాయి. అలాగే ఈ కాఫీ రోజుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. మరి ఏంటా ప్రత్యేకత. ఎందుకు ఈ కాఫీ దినోత్సవాన్ని జరుపుకుంటాం?దాని వెనుక ఉన్న విశేషాలేంటో తెలుసుకుందాం…మనిషి జీవితంలో కాఫీ, టీలు ఓ భాగమైపోయాయి.ఉదయం లేచాక ఓ కప్పు పడకపోతే పనిలో పడలేం. అలా ఉదయం కాఫీతోను టీ తోనో మొదలవుతుంది రోజు. అలాగే ఈ కాఫీ డే రోజున ఏం చేస్తారో చూద్దాం. ఈ రోజు ప్రజలు కాఫీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చర్చలు జరుపుతారు. కాణీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?అలాగే అతిగా తాగితే జరిగే నష్టాలేంటో నిపుణులు వివరిస్తారు.

కాఫీ గురించి అవగాహన కల్పిస్తారు. కాఫీ గురించి వివిధ ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తారు. ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న జరుపుకుంటారు, కాఫీ వాడకాన్ని జరుపుకోవడానికి మరియు ప్రోత్సహించడానికినిస్సందేహంగా.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఇష్టపడే పానీయాలలో కాఫీ ఒకటి.

Read more : International Coffee Day: టేస్టును ఆస్వాదించటమేకాదు..కాఫీ గురించీ తెలుసుకోండి

ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న జరుపుకుంటారు, కాఫీ వాడకాన్ని జరుపుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి. కాఫీ వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాలను కలిగిస్తుందని నమ్ముతున్న చాలా మంది ఉన్నారు, కాబట్టి, ఈ రోజు ప్రజలు ఈ పానీయం యొక్క వివిధ ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తారు.

ప్రతి ఉదయం వేడి వేడి కాఫీ తాగటానికి దాని వెనుక ఎంతమంది కష్టం ఉంటుంది? కాఫీ మొక్క, గింజలు,పంటలు,పండించే విధానం, గింజల్ని కాఫీ పొడిగా తయారుచేసే విధానం వంటి పలు అంశాల వెనుక ఉండే కృషి ఉంటుంది. అలాగే కాఫీ ఫామ్‌లోని కార్మికులు ఎంత కష్టపడతారు? వారి కష్టనష్టాలేంటీ? అవిశ్రాంతంగా పని చేసే వారికి ఉన్న సమస్యలేంటీ? అనే వాటిపై కూడా చర్చలు జరుపుతారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా కాఫీ తోటల్లోను..కాఫీకి సంబంధించి ప్రక్రియల్లో పనిచేసే కార్మికులు, కాఫీ పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తుల కృషి మరియు కృషి కూడా ఈరోజున గుర్తించబడ్డాయి.

Read more : Coffee Benefits : కాఫీతో చర్మ సౌందర్యం..నిగనిగలాడే ఒతైన కురులు మీ సొంతం

మొదటిసారిగా, 2015 లో అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతర్జాతీయ కాఫీ సంస్థ (ICO) 2014 లో కాఫీ ప్రియులందరికీ ఆ రోజును అంకితం చేయాలని నిర్ణయించుకుంది.మొదటి అధికారిక కాఫీ డే 2015 లో మిలన్‌లో ప్రారంభించబడింది. వివిధ దేశాలు తమ సొంత జాతీయ కాఫీ రోజులను వేర్వేరు తేదీలలో జరుపుకుంటాయి. కానీ ఎక్కువ దేశాలు మాత్రం ఈరోజునే కాఫీ దినోత్సవాన్ని జరుపుకుంటాయి.

1997 లో, ICO మొదటిసారిగా చైనాలో అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని జరుపుకుంది. ఆ తరువాత 2009 లో, తైవాన్‌లో జరుపుకుంది. నేపాల్ నవంబర్ 17, 2005 న మొదటి అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని నిర్వహించింది.

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ప్రాముఖ్యత
పానీయాలను ఆరాధించడమే కాకుండా, ఈ రంగం మరియు దానితో సంబంధం ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్లకు జరుగుతున్న అన్యాయాల కోసం గళాలను వినిపించడానికి కూడా ఈ రోజును జరుపుకుంటారు. కాఫీ వ్యాపారం,ఎగుమతులు,దిగుమతులను ప్రోత్సహించడం..ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ సాగు చేసే రైతుల కష్టనష్టాలను వెలుగులోకి తీసుకురావడం కూడా ఈ రోజు ఉద్దేశ్యంగా కొనసాగుతోంది. సుగంధాలు వెదజల్లే ఈ పంట గురించి జ్ఞానాన్ని పొందడం మరియు వాటి నుండి తయారు చేసిన వివిధ రకాల కాఫీలు మరియు వంటకాలను ప్రయత్నించడం ద్వారా రోజును జరుపుకోవడానికి ఈ అంతర్జాతీయ కాఫీ డే ఓ వేదిక..