International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రమాదకర స్థితిలో ఉంది: రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ యూరి బోరిసోవ్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్’ చీఫ్ యూరి బోరిసోవ్ వ్యాఖ్యానించారు. దాన్ని ఎక్కువ కాలం ఉపయోగించలేమని అన్నారు. రష్యా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుందన్న సంకేతాలు ఇచ్చారు. ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు రష్యా సిద్ధమైన విషయం తెలిసిందే. తాము 2024 తర్వాత దాని నుంచి బయటకు రానున్నట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది.

International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రమాదకర స్థితిలో ఉంది: రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ యూరి బోరిసోవ్

International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్’ చీఫ్ యూరి బోరిసోవ్ వ్యాఖ్యానించారు. దాన్ని ఎక్కువ కాలం ఉపయోగించలేమని అన్నారు. రష్యా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుందన్న సంకేతాలు ఇచ్చారు. ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు రష్యా సిద్ధమైన విషయం తెలిసిందే. తాము 2024 తర్వాత దాని నుంచి బయటకు రానున్నట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది.

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న వేళ పలు దేశాలు ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ‘రోస్‌కాస్మోస్’ చీఫ్ యూరి బోరిసోవ్ మాట్లాడుతూ.. ఐఎస్ఎస్ ను నిర్మించి 24 ఏళ్ళు అవుతుండడంతో దానికి సంబంధించిన పరికరాల వైఫల్యాలు సమస్యగా మారాయని చెప్పారు. ఐఎస్ఎస్ లోని సిబ్బంది రక్షణకు ఇది ప్రమాదకరమని అన్నారు. సాంకేతికంగా ఐఎస్ఎస్ వారెంటీ సమయం ముగిసిందని చెప్పారు. ఇది చాలా ప్రమాదకమని చెప్పారు. పరికరాల వైఫల్యాలు మొదలయ్యాయని, పగుళ్ళు కనపడుతున్నాయని అన్నారు.

రష్యా అంతరిక్ష కేంద్రం కాస్మిక్ రేడియేషన్ గురించి మరింత సమాచారాన్ని గ్రహిస్తుందని చెప్పారు. కాగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 1998లో ప్రారంభించారు. అమెరికా-రష్యా, కెనడా, జపాన్, 11 ఇతర యురోపియన్ దేశాలు దీన్ని వాడుకుంటూ పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ద్వారా మరో ఎనిమిది ఏళ్ళు (2030 వరకు) కార్యకలాపాలు కొనసాగించాలని నాసా భావిస్తోంది. ఈ సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రమాదకరంగా మారిందని యూరి బోరిసోవ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

India exercising with Russia: అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ రష్యా చేపట్టిన విన్యాసాల్లో పాల్గొన్న భారత్