Women’s Day 2023: ఏ దేశంలోనూ లేనంతగా మహిళలను అణచివేస్తున్న దేశంగా అఫ్గాన్.. అయినా నేడు 20 మంది మహిళలు వీధిలోకి వచ్చి..
ప్రపంచంలో మహిళల హక్కులను అణచివేస్తున్న దేశాల్లో అఫ్గానిస్థాన్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచం నేడు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐరాస పలు వివరాలు తెలిపింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల పాలనలో ఉన్న విషయం తెలిసిందే. క్రూర చర్యలకు పాల్పడుతున్న తాలిబన్లను ఎదిరించి మరీ దాదాపు 20 మంది అఫ్గాన్ మహిళలు ఇవాళ కాబూల్ లో నిరసన తెలిపారు.

Male Afghan Students Boycott Classes, Protest Women's Education Ban
Women’s Day 2023: ప్రపంచంలో మహిళల హక్కులను అణచివేస్తున్న దేశాల్లో అఫ్గానిస్థాన్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచం నేడు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐరాస పలు వివరాలు తెలిపింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల పాలనలో ఉన్న విషయం తెలిసిందే. క్రూర చర్యలకు పాల్పడుతున్న తాలిబన్లను ఎదిరించి మరీ దాదాపు 20 మంది అఫ్గాన్ మహిళలు ఇవాళ కాబూల్ లో నిరసన తెలిపారు.
అఫ్గాన్ ప్రజలను ప్రపంచ సమాజం కాపాడాలని కోరారు. ఈ మేరకు ప్రపంచ దేశాలు ఓ నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ లో ఐక్యరాజ్యసమితి మిషన్ చీఫ్ రోజా ఒటున్‌బయేవా మాట్లాడుతూ… అఫ్గాన్ మహిళలు, బాలికలు సమాజంలో ఏ కార్యకలాపాల్లోనూ పాల్గొనకుండా క్రమ పద్ధతిలో, ఉద్దేశపూర్వకంగా తాలిబన్లు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఓ వైపు అఫ్గాన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో తాలిబన్లు కఠిన ఆంక్షలు విధిస్తూ, మహిళల హక్కుల అణచివేత చర్యలను పాల్పడుతుండడాన్ని “జాతిని స్వయంగా గాయపర్చుకునే క్రూర చర్య”గా రోజా ఒటున్‌బయేవా అభివర్ణించారు.
అఫ్గాన్ లో మహిళలు కనీసం నిరసన తెలిపేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు తాలిబన్లు. ఇప్పటికే బాలికలు మాధ్యమిక విద్యను అభ్యసించకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లనుందని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంఘం ‘హెచ్ఆర్‌డబ్ల్యూ’ తెలిపింది. అఫ్గాన్ లో బాలికలు ఎదుర్కొంటున్న దుస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గాన్ లో లక్షలాది మంది బాలికలు తమకున్న అవకాశాలను కోల్పోతున్నారని చెప్పింది.
భవిష్యత్తుల్లో అమ్మాయిలు చదువుకోవచ్చా? అన్న విషయంపై కూడా కనీసం మాట్లాడుకునే అవకాశం ఉండకపోవచ్చని అఫ్గాన్ మహిళలు అంటున్నారు. అఫ్గాన్ ను తాలిబన్లు 2021, ఆగస్టు నుంచి తమ అధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అఫ్గాన్ లోని బాలికల, మహిళల ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్నారు. గవర్నమెంట్ సర్వీసుల్లో మహిళల నాయకత్వం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. మహిళలు ప్రయాణం చేయాలంటే పురుషుడి తోడు ఉండాల్సిందే.
Rishi Sunak: అక్రమ వలసదారులపై బ్రిటన్ కొరడా.. దేశంలోకి రాకుండా కొత్త చట్టం తెస్తున్న రిషి సునాక్