World Economy: షాకింగ్ సర్వే.. కప్పలు, పాముల వల్ల 16బిలియన్ డాలర్లు నష్టమట..

కప్పలు, పాములు.. మనం తరచూ చూస్తుండే ప్రాణులే.. అయితే వాటి వల్ల 34ఏళ్లుగా గ్లోబల్ ఎకానమీకి భారీ నష్టం వాటిల్లింది. ఈ షాకింగ్ విషయం అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు కారణాలుకూడా వారు వెల్లడించారు.

World Economy: షాకింగ్ సర్వే.. కప్పలు, పాముల వల్ల 16బిలియన్ డాలర్లు నష్టమట..

American Bullfrog And Brown Tree Snake

World Economy: కప్పలు, పాములు.. మనం తరచూ చూస్తుండే ప్రాణులే.. అయితే వాటి వల్ల 34ఏళ్లుగా గ్లోబల్ ఎకానమీకి భారీ నష్టం వాటిల్లింది. ఈ షాకింగ్ విషయం అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు కారణాలుకూడా వారు వెల్లడించారు. అమెరికన్ బుల్ ఫ్రాంగ్, బ్రౌన్ ట్రీ స్నేక్ కారణంగా 1986 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు జరిగిన నష్టాన్ని వారు సుమారుగా అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు ప్రాణుల వల్ల 16 బిలియన్ డార్లు నష్టపోవాల్సి వచ్చిందని వారి అధ్యయనంలో తేల్చారు.

Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్.. షిండే వర్గానికి మద్దతు తెలిపిన ఉద్ధవ్ మేనల్లుడు

శాస్త్రవేత్తల రిపోర్టు ప్రకారం.. బ్రౌన్ ట్రీ స్నేక్ లు ఏకంగా 10.3 బిలియన్ డాలర్ల విలువైన నష్టానికి కారణమని వారు అంచనా వేశారు. పాక్షికంగా అనేక పసిఫిక్ దీవుల్లో అవి అదుపు లేకుండా వ్యాపిస్తున్నాయి. అయితే గ్యామ్ లో గత శతాబ్ధంలో యూఎస్ మెరైన్ లచే సరీసర్పాలు ప్రవేశించినట్లు చెబుతుంటారు. బ్రౌన్ ట్రీ స్నేక్ లు ఈ ప్రాంతంలోని విద్యుత్ పరికరాలపై పాకుతూ, అవి పని చేయకుండా చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్లు ఈ పాములను ఇక్కడ వదిలారని చెబుతారు. అయితే రెండు మిలియన్ల కు పైగా బ్రౌన్ ట్రీ పాములు చిన్న పసిఫిక్ ద్వీపంలో ఉన్నట్లు అంచనా.

అదేవిధంగా అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌ల సంతానోత్పత్తి ప్రదేశాల చుట్టూ ఖరీదైన కప్ప-ప్రూఫ్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయవలసి వస్తుందట. బ్రౌన్ అండ్ గ్రీన్ ఫ్రాంగ్ లను లితోబేట్స్ కాటేస్ బియానస్ గా పిలుస్తారు. ఉభయచరాలు తప్పించుకోవడాన్ని కేవలం ఐదు చెరువులకు కంచె వేయడం వల్ల జర్మన్ అధికారులు €270,000 (£226,300) ఖర్చవుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. వీటి కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తోందని, అందుకే వీటి రవాణాను అరికట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కొందరు కావాలనే విషపూరితమైన పాములను కొని తెచ్చుకొని పెంచుతుకుంటున్నారు. ఇలాంటి వారితో ప్రమాదం ముంచుకొస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.