iPhone: యుక్రెయిన్ సైనికుడి ప్రాణం కాపాడిన ఐఫోన్

యుక్రెయిన్ సైనికుడి ప్రాణాలు కాపాడింది ఐఫోన్. బుల్లెట్ గాయం నుంచి ఐఫోన్ 11ప్రో తట్టుకుని ఉన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో సైనికుడు ఐఫోన్‌ను తన వెనుక భాగంలో ఉంచుకున్నట్లుగా కనిపిస్తుంది. అందులో బుల్లెట్ ఇరుక్కుపోయినట్లు కూడా స్పష్టమవుతుంది.

iPhone: యుక్రెయిన్ సైనికుడి ప్రాణం కాపాడిన ఐఫోన్

Iphone

 

iPhone: యుక్రెయిన్ సైనికుడి ప్రాణాలు కాపాడింది ఐఫోన్. బుల్లెట్ గాయం నుంచి ఐఫోన్ 11ప్రో తట్టుకుని ఉన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో సైనికుడు ఐఫోన్‌ను తన వెనుక భాగంలో ఉంచుకున్నట్లుగా కనిపిస్తుంది. అందులో బుల్లెట్ ఇరుక్కుపోయినట్లు కూడా స్పష్టమవుతుంది.

దీనిపై నెటిజన్లు పలు రకాల స్పందిస్తున్నారు. యాపిల్ ఫోన్ దీనికైనా పనికొచ్చిందని కామెంట్ చేస్తుంటే.. బుల్లెట్ ప్రూఫ్ జకెట్ తయారుచేయడానికి ఎందుకు ఉపయోగించారో అంటూ సెటైర్లు విసురుతున్నారు.

యుక్రెయిన్ – రష్యాల మధ్య యుద్ధం ముగుస్తుందనడానికి ఎటువంటి సంకేతాలు కనిపించడం లేదు.

Read Also: యుక్రెయిన్ విద్యార్థుల కోసం రష్యన్ జర్నలిస్టు నోబెల్ ప్రైజ్ వేలం

రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడికి పాల్పడుతూ… ఇటీవల వరసగా రాకెట్లతో విరుచుకుపడుతోంది. మూడు రోజుల్లో దాదాపుగా 40కి పైగా మంది రష్యా దాడిలో మరణించినట్లు యుక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24న సైనిక చర్యగా ప్రారంభం అయిన రష్యా, యుక్రెయిన్ సంక్షోభం యుద్ధంగా మారింది.

ఇటీవల రష్యా, ఉక్రెయన్ తూర్పు భాగాలు డోన్ బాస్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. తూర్పు ప్రాంతంలోని అనేక పట్టణాలను, దగరాలపై వరుసగా దాడులు చేస్తూ రష్యా ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది.