Mahsa Amini: హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో 14,000 మందిని అరెస్ట్ చేసిన ఇరాన్

ఇరాన్‭లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి దీనిపై చాలా కాలంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ, దీనిని సవరించడానికి ప్రభుత్వాలు సముఖంగా లేవు.

Mahsa Amini: హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో 14,000 మందిని అరెస్ట్ చేసిన ఇరాన్

Iran anti-hijab protest: 14, 000 arrested in last six weeks, says United Nations

Mahsa Amini: మహ్సా అమినీ అనే 22 ఏళ్ల మహిళ మరణంతో ఇరాన్‭లో రేగిన హిజాబ్ వివాదం కారణంగా గడిచిన ఆరు వారాల్లో సుమరు 14,000 మందిని అరెస్ట్ చేసినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం అనుమానస్పద స్థితిలో అమిని మరణించింది. అంతే, ఈ ఘటనతో ఇరాన్‭లోని మహిళా లోకం రోడ్డెక్కింది. వారాల పాటు ఈ వివాదం ఆ దేశాన్ని కుదిపివేసింది.

కాగా, ఈ విషయమై తాజాగా ఐక్యరాజ్య సమితి స్పందిస్తూ ‘‘గడిచిన ఆరు వారాల్లో పురుషులు, మహిళలు, చిన్నారులు.. ఇలా మొత్తంగా 14,000 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, విద్యార్థులు, లాయర్లు, పౌర హక్కుల కార్యకర్తలు కూడా ఉన్నారు’’ అని పేర్కొంది.

విషయంలోకి వెళ్తే.. మహ్సా అమినీ అనే 22 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఇరాన్ రాజధాని టెహ్రన్‭కు వెళ్లింది. అయితే ఆమె హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. సడెన్‭ను ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పూర్తిగా కోమాలోకి వెళ్లిన అమినీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 16న మరణించింది. ఈ ఘటనపై ఇరాన్ మహిళా లోకం భగ్గుమంది. అమినీని పోలీసులు భౌతికంగా హింసించారని, ఆమె ఒంటిపై గాయాలున్నాయని, ఆమెది ముమ్మాటికీ హత్యేనని కుటుంబీకులు సహా మహిళా లోకం తీవ్రంగా ఆరోపిస్తోంది.

ఇరాన్‭లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి దీనిపై చాలా కాలంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ, దీనిని సవరించడానికి ప్రభుత్వాలు సముఖంగా లేవు.

మరోవైపు నిరసన చేస్తున్న మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి. హిజాబ్ తొలగిస్తున్న మహిళలు లక్ష్యంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ అణచివేతతో పాటు పౌర సమాజంలోని కొంత మంది దాడుల నడుమ ముస్లిం మహిళలు తన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Chinese Rocket: చైనా రాకెట్ కూలుతుందన్న భయం.. స్పెయిన్‌లో ఎయిర్‌పోర్టుల మూసివేత