కరో కరో జర జల్సా : కరోనా వార్డుల్లో వైద్యుల డ్యాన్స్..ఎందుకో తెలుసా

  • Published By: madhu ,Published On : March 6, 2020 / 03:25 AM IST
కరో కరో జర జల్సా : కరోనా వార్డుల్లో వైద్యుల డ్యాన్స్..ఎందుకో తెలుసా

కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించడం అంటే సాధారణ విషయమేమీకాదు. ఆ వైరస్‌ నుంచి వైద్యులు తమను తాము కాపాడుకోవడమూ ఎంతో ముఖ్యం. తమను పాడుకుంటూనే.. కరోనా బాధితులనూ రక్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇరాన్‌ వైద్యులు విభిన్నంగా వ్యవహరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. కరోనా వైరస్‌తో ఆస్పత్రికి వచ్చిన రోగులకు చికిత్స అందించడంతో పాటు.. నృత్యాలు చేస్తూ తమకు తాము మనో ధైర్యాన్ని పొందుతున్నారు. అలా వారు చేసిన పలు డ్యాన్సింగ్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇరాన్‌ వైద్యులు చేసిన డ్యాన్సులు కరోనా వైరస్‌ ‘ఇరాన్‌ డ్యాన్సింగ్’ పేరుతో ట్విటర్‌లో దర్శనమిస్తున్నాయి. వాటిల్లో మాస్కులు, రక్షణాత్మక వస్త్రాలు ధరించిన కొందరు వైద్యులు ఇరానీ సంగీతానికి నృత్యం చేస్తూ కనిపించారు. ఆ సన్నివేశాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ వీడియోలు పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షలాది మంది వీక్షించారు. వైద్యులు  రోగులను చూసుకుంటూ…. వారి కుటుంబాల్లోనూ మనోధైర్యాన్ని నింపుతున్నారని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరోవైపు..ఇరాన్ ఈ వైరస్‌తో వణికిపోతోంది. కోవిడ్ – 19 కారణంగా ఇరాన్‌లో మృతి చెందిన వారి సంఖ్య…107కి పెరిగింది. నిర్ధారిత కేసుల సంఖ్య 3 వేల 513గా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని చర్యలు తీసుకొంటోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. పర్షియన్ల కొత్త సంవత్సరమైన మార్చి 20వ తేదీన స్కూళ్లు, యూనివర్సిటీలను మూసివేయనున్నట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి సయీద్ నమామీ వె ల్లడించారు.

Read More : COVID-19 : విమానాశ్రయాలు వెలవెల..2 లక్షల విమానాలు రద్దు

కరోనా వైరస్ మరణాలు చైనా తర్వాత..ఇరాన్, ఇరాక్‌లోనే అధికంగా ఉన్నాయి. పర్యాటకులను వెస్ట్ బ్యాంకులోకి అనుమతించడం లేదని తెలిపారు. వెస్ట్ బ్యాంకును సందర్శించే పర్యాటకులు బెత్లెహామ్, జెరిఖోలను సందర్శిస్తుంటారనే సంగతి తెలిసిందే.