మా దేశంలో 3.5 కోట్ల మందికి కరోనా, ప్రధాని సంచలన వ్యాఖ్యలు

మా దేశంలో 3.5 కోట్ల మందికి కరోనా, ప్రధాని సంచలన వ్యాఖ్యలు

మా దేశంలో 3.5 కోట్ల మందికి కరోనా, ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఆసియా దేశం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని కరోనా కేసుల సంఖ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తమ దేశంలో రెండున్నకోట్ల మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని ఆయన చెప్పారు. మున్ముందు కొన్ని నెలల వ్యవధిలోనే కరోనా వైరస్ కేసుల సంఖ్య మూడున్నర కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. గత 150 రోజుల్లో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్యలో రాబోయే రోజుల్లో చేరతారని రౌహాని చెప్పారు. కరోనా భూతం తీవ్రతను గుర్తించి ప్రజలు జాగ్రత్తగా మసలుకోవాలని, ఊహించని రీతిలో కేసులు వస్తున్నాయని రౌహాని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవన్నారు. దేశంలో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.

రానున్న నెలల్లో 3.5 కోట్ల మందికి కరోనా:
కరోనా మహమ్మారిని ప్రజలు తీవ్రంగా పరిగణించి జాగ్రత్తగా ఉండాలని అధ్యక్షుడు పిలుపునిచ్చారు. ఆరోగ్యశాఖ చేసిన అధ్యయనంలో ఊహించని సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయని తెలిపారు. రాబోయే నెలల్లో మూడున్నర కోట్ల మందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని రౌహాని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కాగా, వేటి ఆధారంగా నివేదికను రూపొందించారో ఇరాన్‌ అధికారులు వెల్లడించ లేదు.

ప్రజల వెన్నులో వణుకు:
ఇరాన్ లో ఫిబ్రవరిలో 2లక్షల 70వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 13వేల 979 మంది మరణించారు. చివరి 24 గంటల్లో 2వేల 166 కొత్త కేసులు నమోదు కాగా.. 188 మంది మృతిచెందారు. అయితే ఆ దేశాధ్యక్షుడి చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ దేశం చాలా దారుణ పరిస్థితుల్లో ఉందని తెలుస్తోంది. అయితే కేసులు పెరుగుతుండటంతో రాజధాని టెహ్రాన్‌లో మళ్లీ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జనాలు ఎక్కువగా గుమిగూడే అవకాశమున్న వ్యాపార, వాణిజ్య ప్రాంతాలను మూసేయనున్నారు. ఇప్పుడున్న అధికారిక గణాంకాల కన్నా రెట్టింపు సంఖ్యలో మృతులు ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ చాలా చిన్న దేశం. ఆ దేశ జనాభా 2018 లెక్కల ప్రకారం దాదాపు 8.18 కోట్లు. అందులో రెండున్నర కోట్ల మందికి కరోనా సోకిందని ఆ దేశాధ్యక్షుడే స్వయంగా ప్రకటించడం గమనార్హం.

×